టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఆయన వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయడం..వారిని పొగడటం టిడిపి నేతలకు మింగుడుపడటం లేదు. అయితే చాలా రోజుల నుంచి సొంత పార్టీతోనే కేశినేనికి ఇబ్బందులు ఉన్నాయి. విజయవాడలో కొంతమంది టిడిపి నేతలతో కేశినేనికి పెద్దగా పడదు. అయితే వారి వల్లే పార్టీ దెబ్బతింటుందని కేశినేని చెబుతూ వస్తున్నారు.
అలాగే పార్టీలోని తప్పులని చెప్పి వాటిని సరిదిద్దుకొమంటే..తానే పార్టీ మారిపోతున్నానని ప్రచారం చేస్తున్నారని కేశినేని మండిపడుతున్నారు. ఇదే సమయంలో కేశినేని పోటీగా ఆయన తమ్ముడు కేశినేని చిన్ని విజయవాడలో పనులు మొదలుపెట్టారు. నెక్స్ట్ ఎంపీ సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నానికి వ్యతిరేకంగా ఉన్న టిడిపి నేతలు చిన్నికి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో నాని టిడిపికి మరింత దూరమవుతున్నారు.

ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయా నియోజకవర్గాల్లో పనులు ప్రారంభిస్తున్నారు. ఎంపీగా పనులు చేయడంలో తప్పు లేదు గాని..అదే సమయంలో ఎమ్మెల్యేలని పొగడటం ఆయా స్థానాల్లో టిడిపి నేతలకు ఇబ్బందిగా మారింది. దీంతో కేశినేనిపై టిడిపి నేతలు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సమయంలో వైసీపీలోకి రావాలని కేశినేనికి..వైసీపీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ఆహ్వానం పలికారు.
ఎలాగో విజయవాడ పార్లమెంట్ లో వైసీపీకి నాయకుడు లేరు. గత ఎన్నికల్లో ఓడిపోయిన పివిపి అడ్రెస్ లేరు. దీంతో కేశినేనిని వైసీపీలోకి తీసుకొచ్చి ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం పెరిగింది. కానీ కేశినేని అలా తేలికగా పార్టీ మారే వ్యక్తి కాదు. అవసరమైతే రాజకీయాలని నుంచి కూడా తప్పుకుంటారు. కానీ వేరే పార్టీ చేరే ఛాన్స్ లేదు. కానీ టిడిపిలో సీటు దక్కుతుందా? నెక్స్ట్ ఆయన రాజకీయ స్టెప్ ఎలా ఉంటుందనేది చూడాలి.