రాయలసీమ అంటే డౌట్ లేకుండా వైసీపీ కంచుకోట అని చెప్పవచ్చు..గత ఎన్నికల్లో కావచ్చు..అంతకముందు 2014 ఎన్నికలు కావచ్చు. వైసీపీదే హవా. 2019 ఎన్నికల్లో సీమలో నాలుగు ఉమ్మడి జిల్లాలు కలిపి 52 సీట్లు ఉంటే వైసీపీ 49 సీట్లు గెలుచుకుంది. అంటే వైసీపీ హవా ఏ స్థాయిలో నడిచిందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సారి ఎన్నికల్లో అదే పరిస్తితి ఉంటుందా? అంటే చెప్పడం కష్టం. ఈ సారి మాత్రం వైసీపీ హవా తగ్గింది..అదే సమయంలో టీడీపీ పికప్ అవుతుంది.

విచిత్రం ఏంటంటే వైసీపీ కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో టీడీపీ పికప్ అవుతుంది. ఈ సారి వైసీపీ కంచుకోటల్లో టీడీపీ పాగా వేసేలా ఉంది. చిత్తూరు జిల్లాలో నగరిలో గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. కానీ ఈ సారి మాత్రం వైసీపీ గెలుపు డౌటే అనే పరిస్తితి. పీలేరులో సైతం రెండు సార్లు వైసీపీ గెలిచింది. ఇప్పుడు అక్కడ టీడీపీ పికప్ అయింది. కాబట్టి నెక్స్ట్ పీలేరులో వైసీపీ గెలుపు డౌటే. మదనపల్లెలో కూడా అదే పరిస్తితి కనిపిస్తోంది.

అటు గంగాధర నెల్లూరులో కూడా పరిస్తితి మారుతుంది. ఇక కడపలో రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు స్థానాల్లో ఈ సారి వైసీపీ పరిస్తితి అంత బాగున్నట్లు కనిపించడం లేదు. ఆ స్థానాల్లో ఈ సారి టీడీపీ హవా నడిచేలా ఉంది. ఇటు కర్నూలుకు వస్తే కర్నూలు సిటీ, ఆలూరు, పత్తికొండ, బనగానపల్లె, మంత్రాలయం, ఆదోని సీట్లలో సీన్ మారుతుంది. అటు అనంతపురంలో కదిరిలో వైసీపీ రెండుసార్లు వరుసగా గెలిచింది. కానీ ఈ సారి ఆ పరిస్తితి కనిపించడం లేదు. మొత్తానికి ఈ సారి వైసీపీ కంచుకోటల్లో టీడీపీ హవా నడిచేలా ఉంది.
