May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీ కంచుకోటలోకి లోకేష్..టీడీపీకి లీడ్ వస్తుందా?

మొత్తానికి ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో విజయవంతంగా పాదయాత్ర పూర్తి చేసుకుని నారా లోకేష్..ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక లోకేష్ పాదయాత్ర వల్ల ఆ రెండు జిల్లాల్లో టి‌డి‌పికి కొత్త ఊపు వచ్చింది. ఇప్పుడు కర్నూలుపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది చూడాలి. అసలు కర్నూలు అంటే వైసీపీ కంచుకోట అనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ సత్తా చాటింది.

గత ఎన్నికల్లో జిల్లాలో 14 సీట్లు ఉంటే..వైసీపీ 14 సీట్లు గెలుచుకుంది. ప్రతి నియోజకవర్గంపై వైసీపీకి పట్టు ఉందనే చెప్పాలి. అలా వైసీపీకి పట్టున్న జిల్లాలో లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. డోన్ నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర మొదలైంది..తర్వాత పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కర్నూలు సిటీ, శ్రీశైలం, ఆళ్లగడ్డ, నంద్యాల ..ఇలా కర్నూలు జిల్లాలో పర్యటన సాగనుంది.

ఇక లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరిగింది..కర్నూలు ప్రజలు  కూడా పెద్ద ఎత్తున మద్ధతు తెలిపేలా ఉన్నారు. రెండుసార్లు వైసీపీని గెలిపించిన సరే కర్నూలుకు ఒరిగింది ఏమి లేదు. గతంలో టి‌డి‌పి అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు అభివృద్ధి  శూన్యం. అదేమంటే పథకాలు ఇస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.

అయితే పథకాల పేరిట రూపాయి ఇచ్చి, పన్నుల పేరిట వంద రూపాయిలు లాగేస్తున్నారు. ఆ విషయం ప్రజలకు అర్ధమైంది. అందుకే కర్నూలులో వైసీపీపై వ్యతిరేకత పెరిగింది. ఇప్పటికే సగం నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకత ఉంది. టి‌డి‌పికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇపుడు లోకేష్ ఎంట్రీతో ఇంకా వైసీపీ పరిస్తితి దిగజారే ఛాన్స్ ఉంది. టి‌డి‌పి బలం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి లోకేష్..కర్నూలులో టి‌డి‌పి బలం పెంచే ఛాన్స్ ఉంది.