రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే..ఆ నియోజకవర్గాల్లో వైసీపీకి ఓటమి ఎదురవ్వడం కష్టం. పరిస్తితులు ఎలా ఉన్నా సరే ఆ స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతూనే వస్తుంది. అయితే ఇది మొన్నటివరకు ఉన్న పరిస్తితి..కానీ ఇప్పుడు పరిస్తితి మారుతుందని తెలుస్తోంది. ఈ సారి కొన్ని వైసీపీ కంచుకోటలు బద్దలవుతాయని తెలుస్తోంది. ఆయా స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం..అదే సమయంలో టీడీపీపై సానుభూతి ఉండటం వల్ల సమీకరణాలు మారతాయని తెలుస్తోంది.

అలా సమీకరణాలు మారే నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కావలి, నెల్లూరు సిటీ స్థానాలు ఉంటాయని సమాచారం. ఈ మూడు స్థానాల్లో వైసీపీ వరుసగా రెండుసార్లు గెలుస్తూ వచ్చింది. పైగా కందుకూరు లాంటి స్థానంలో కమ్మ ఓటర్లు ఎక్కువ. అయిన ఇక్కడ వరుసగా నాలుగుసార్లు టీడీపీ ఓడిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడు టీడీపీకి సానుకూల పవనాలు ఉన్నాయని తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ నేతలు ఐక్యంగా పనిచేస్తే కందుకూరుని కైవసం చేసుకోవడం సులువు అని చెప్పవచ్చు.

ఇక కావలిలో గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది..అయితే ఈ సారి అక్కడ వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత పెరగడం..టీడీపీకి కలిసొస్తుంది. కాస్త గట్టిగా కష్టపడి పనిచేస్తే ఈ కావలిని టీడీపీ కైవసం చేసుకోవచ్చు. ఇక నెల్లూరు సిటీ మాజీ మంత్రి అనిల్ కుమాద్ యాదవ్ వరుసగా రెండు సార్లు గెలిచారు.

కానీ ఈ సారి ఆయనకు అక్కడ అనుకూల వాతావరణం లేదు. ఇక్కడ టీడీపీ బలపడుతుంది. టీడీపీ తరుపున మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తే అనిల్‌కు చెక్ పెట్టవచ్చని తెలుస్తోంది. మొత్తానికి ఈ వైసీపీ కంచుకోటలు ఈ సారి బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Leave feedback about this