ఏపీలో బీజేపీ అధికార వైసీపీపై పోరాటం చేయడం కంటే..ప్రతిపక్ష టిడిపిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తుంది. పైకి ఏమో వైసీపీపై పోరాటం చేస్తున్నట్లు హడావిడి చేస్తున్న..డైరక్ట్ గా టిడిపిని ఇరుకున పెట్టాలని బిజేపి చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బిజేపిలో కొందరు నేతలు టిడిపినే టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడైనా అధికార పార్టీని టార్గెట్ చేస్తారు..ఏపీలో మాత్రం బిజేపి ప్రతిపక్ష టిడిపిని టార్గెట్ చేస్తుంది. సోము వీర్రాజు, జివిఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు టిడిపిపైనే విమర్శలు చేస్తున్నారు.

ఒకవేళ వైసీపీపైన ఏమైనా విమర్శల్ చేయాల్సి వచ్చిన..వైసీపీని సున్నితంగా విమర్శించి..టిడిపిపై విరుచుకుపడతారు. ఇక పొత్తులపై పదే పదే మాట్లాడుతూ..టిడిపితో పొత్తు పెట్టుకునే ప్రశక్తి లేదని బిజేపి నేతలు స్టేట్‌మెంట్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. అసలు టిడిపి ఎక్కడా కూడా బిజేపితో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పలేదు. అటు పవన్-చంద్రబాబు మాత్రం రెండుసార్లు కలిశారు. అయితే పవన్..బిజేపితో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో బిజేపి నేతలు తమకు జనసేనతోనే పొత్తు ఉందని, టిడిపితో పొత్తు పెట్టుకోమని అంటున్నారు.

ఒకవేళ పవన్ టిడిపితో కలవాలని అనుకుంటే బిజేపిని వదిలి రావాల్సిందే. అయితే ఒక్క శాతం ఓట్లు లేని బిజేపి..జనసేనని కలుపుకుని మళ్ళీ ఓట్లు చీల్చి పరోక్షంగా వైసీపీకి లాభం, టిడిపికి నష్టం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుపై పదే పదే కామెంట్ చేస్తున్నారు. తాజాగా కూడా సోము వీర్రాజు.. టీడీపీతో తాము కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఉన్నవి కుటుంబ పార్టీలని, ఈ రెండు పార్టీలను రాజకీయ ముఖచిత్రం నుంచి దూరం చేయడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. అయితే పైకి వైసీపీ పేరు చెప్పిన బిజేపి అసలు టార్గెట్ టిడిపి అని తెలుస్తోంది.
