వైసీపీ కోసం టిడిపి నేతలు కష్టపడుతున్నారు..అవును నిజమే వైసీపీ కోసం టిడిపి నేతలు పనిచేస్తున్నారు..అదేంటి అలా ఎలా పనిచేస్తారని అనుకోవచ్చు. అదే మరి రాజకీయం అంటే. టిడిపి లో ఉంటూ పరోక్షంగా వైసీపీకి సహకరించే కోవర్టు నేతలు ఎక్కువగానే ఉన్నారు. వారి వల్ల పార్టీకి పరోక్షంగా నష్టం మాత్రం గట్టిగా జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పరిస్తితి ఎక్కువ కనిపిస్తుంది. నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట అనే చెప్పాలి.

గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. అయితే నెల్లూరు సిటీ సీటుని చాలా స్వల్ప మెజారిటీ తేడాతో టిడిపి ఓడిపోయింది. అలా ఓడిపోవడానికి వైసీపీ గాలితో సంబంధం లేదు. టిడిపిలో ఉండే కొందరు నేతలు పరోక్షంగా వైసీపీకి సహకరించడం వల్లే ఆ పరిస్తితి వచ్చిందనే ప్రచారం వచ్చింది. ఇక నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలో కూడా అలాగే జరిగింది. కనీసం పూర్తి స్థాయిలో అభ్యర్ధులని నిలబెట్టిన దుస్తితికి టిడిపికి ఉంది.

ఇక కనీసం ఒక్కర్ డివిజన్ కూడా టిడిపి గెలుచుకోలేదు. అంటే టిడిపి పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే జిల్లాలో ఇప్పుడుప్పుడే కాస్త పరిస్తితి మారుతుంది. కొన్ని స్థానాల్లో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తుంది. నెల్లూరు సిటీ, కావలి, కోవూరు, ఉదయగిరి లాంటి స్థానాల్లో వైసీపీపై వ్యతిరేకత ఉంది.

ఇక టిడిపి కష్టపడి పనిచేస్తే ఆ స్థానాలని గెలుచుకోవడం ఈజీ. కానీ టిడిపిలో ఉండే కొందరు నేతలు వైసీపీని గెలిపించేలా ఉన్నారు. టిడిపిలో పనిచేస్తూనే వైసీపీకి కోవర్టులుగా పనిచేస్తున్నారని, పరోక్షంగా వైసీపీకి సాయం చేస్తున్నారని వారి వల్ల టిడిపికే నష్టమని తెలుస్తోంది. అలాంటి వారిని పార్టీ అధిష్టానం పక్కన పెడితే కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే నెల్లూరులో టిడిపి గెలవడం కష్టమవుతుంది.
