గత రెండు ఎన్నికల్లో వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తున్న స్థానాల్లో..ఈ సారి ఆ పార్టీకి భారీ దెబ్బ తగిలేలా ఉంది. రెండు సార్లు గెలిపించిన ఆయా నియోజకవర్గ ప్రజలకు వైసీపీ ఒరగబెట్టింది ఏమి లేనట్లే కనిపిస్తుంది. పైగా ఇప్పుడు అధికారంలో ఉంటూ కూడా చేసింది ఏమి లేదు. దీంతో వైసీపీ హవా కొనసాగిన స్థానాల్లో ఈ సారి సీన్ రివర్స్ అవుతుంది. అనూహ్యంగా టిడిపి బలపడుతుంది.
ఈ సారి ఎన్నికల్లో టిడిపి గెలవడం పక్కా అనే పరిస్తితి. అలా వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలే స్థానాల్లో పాతపట్నం ముందు వరుసలో ఉంది. ఇక్కడ టిడిపి గెలిచే ఛాన్స్ ఉంది. ఇక రాజాం స్థానంలో గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది..ఇపుడు టిడిపికి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే బొబ్బిలి లాంటి వైసీపీ కంచుకోటలో టిడిపి జెండా ఎగరనుంది. అటు కురుపాంలో కూడా టిడిపికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు మాడుగుల స్థానంలో పట్టు సాధించవచ్చు.

అలాగే జగ్గంపేట లో వైసీపీ వీక్ అయింది. టిడిపి హవా మొదలైంది. ఇక నూజివీడు, తిరువూరు లాంటి చోట్ల టిడిపికి పట్టు పెరిగింది. గుంటూరు ఈస్ట్, మంగళగిరి, బాపట్ల స్థానాల్లో వైసీపీకి ఈ సారి టిడిపి చెక్ పెట్టనుంది. సంతనూతలపాడు, గిద్దలూరు స్థానాల్లో టిడిపికి లీడ్ ఉంది. అటు నెల్లూరు సిటీ, కావలి, నెల్లూరు రూరల్, ఉదయగిరి స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి.
ఇటు నగరి, పీలేరు, పలమనేరు, కదిరి, కర్నూలు సిటీ, మంత్రాలయం, ఆదోని, శ్రీశైలం, మైదుకూరు, ప్రోద్దటూరు లాంటి సీట్లలో వైసీపీ రెండుసార్లు గెలిచింది..కానీ ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి భారీ దెబ్బ తప్పదు.