ఏపీలో అధికార వైసీపీకి అనుకున్నంత ఏమి అనుకూల పరిస్తితులు లేనట్లే కనిపిస్తున్నాయి. ఏదో అధికారం ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తం తమకే ఎక్కువ బలం ఉందని వైసీపీ ఫీల్ అవుతుంది. కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే పరిస్తితులు వేరుగా ఉన్నాయని తెలుస్తోంది. కేవలం అధికార బలంతోనే స్థానిక ఎన్నికల్లో వన్ సైడ్‌గా గెలవగలిగారని, కానీ అసలు ఎన్నికలోచ్చేసరికి పరిస్తితులు మొత్తం మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఏదో ఇప్పుడు టీడీపీ పని అయిపోయిందని, చంద్రబాబుకు వయసు అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు గానీ, ఆ ప్రచారానికి తగ్గట్టు మాత్రం పరిస్తితులు లేవని అంటున్నారు. వైసీపీ ప్రచారమే తప్ప బాబు సత్తా ఏమి తగ్గలేదని, అలాగే టీడీపీ పని కూడా అయిపోలేదని వివరిస్తున్నారు. టీడీపీకి ఉన్న క్యాడర్ స్ట్రాంగ్‌గానే ఉందని, అదే సమయంలో నాయకులు కూడా పికప్ అవుతున్నారని చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే తిరుగులేని మెజారిటీతో ఉన్న వైసీపీ బలం నిదానంగా తగ్గుతుంటే, టీడీపీ బలం నిదానంగా పెరుగుతుందని ఆ విషయం వైసీపీ గ్రహించకుండా…తమదే పైచేయి అన్నట్లు ఫీల్ అవుతుందని, అలాగే నెక్స్ట్ ఎన్నికల వరకు ఉంటే వైసీపీ భారీగానే దెబ్బతినడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే వైసీపీలో సగం మంది ఎమ్మెల్యేల పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

ఆ సగం మంది వల్ల వైసీపీకి డ్యామేజ్ జరగడం ఖాయమని, వారు నెక్స్ట్ ఎన్నికల్లోపు పికప్ అవ్వకపోతే వైసీపీకి ఎలాంటి నష్టం జరుగుతుందో ఊహించుకోవడం కష్టమే అని అంటున్నారు. ఏదో ఇప్పుడు అధికార బలం ఉంది కదా అని వైసీపీ నేతలు వారిని వారే మోసం చేసుకుంటున్నారని, దీని వల్ల టీడీపీకి ఏమి నష్టం జరగదని, వైసీపీకే డ్యామేజ్ జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పుడు సగం మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంటే..ఎన్నికల నాటికి ఆ వ్యతిరేకత పెరిగితే జగన్‌కు రెండోసారి సీఎం అయ్యే ఛాన్స్ కూడా దక్కదని అంటున్నారు.

Discussion about this post