అధికార వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇంతకాలం తిరుగులేని బలంతో ఉన్న వైసీపీకి సొంత నేతలే షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది..అటు ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత పెరుగుతుంది. దీనికి తోడు నేతల మధ్య ఆధిపత్య పోరు ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో పార్టీలో కొందరు నేతలు అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. చిన్న స్థాయి నేతలు ఏమో..ఎమ్మెల్యేలపై అసంతృప్తి రాగం వినిపిస్తుంటే..ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు చేసే పరిస్తితి కనిపిస్తోంది.

ఇప్పటికే కింది స్థాయిలో సర్పంచ్‌లు, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎక్కడకక్కడ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు ఏమో నిధులు అందకపోవడం, అభివృద్ధి పనులు చేయకపోవడం లాంటి అంశాల్లో అసంతృప్తిగా ఉన్నారు. ఎంతసేపు జగన్ బటన్ నొక్కడం వాలంటీర్ల ద్వారా లబ్దిదారులకు పథకాల డబ్బులు పంచడం. మధ్యలో ఎమ్మెల్యేలు చేసేదేమీ కనిపించడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు చాలావరకు అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వారు పార్టీ నుంచి బయటకొచ్చారు.


వరుసపెట్టి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వ విధానాలని తప్పుబట్టారు.దీంతో వారిని వైసీపీ అధిష్టానం సైడ్ అయ్యేలా చేసింది. దీంతో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకొచ్చారు. ఇక టీడీపీలోకి వెళ్ళడం కోసమే వారు ఇలా విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ టిడిపి అధిష్టానం మాత్రం వారితో కాంటాక్ట్ అయినట్లు కనిపించడం లేదు.

ఇదే క్రమంలో వైసీపీలో ఇలా తిరుగుబాట్లు జరగడానికి కారణం కమలం పెద్దలు అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే ఆనంని బీజేపీలోకి ఆహ్వానించారు. సోము వీర్రాజు..ఆనంతో మాట్లాడారు. అటు కోటంరెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ రూట్ నుంచే వచ్చారు. గతంలో ఏబివిపి లో పనిచేశారు. అటు వివేకా హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. ఈ పరిణామాలు బట్టి చూస్తే వైసీపీలో అలజడికి కమలం కారణమనే చర్చ నడుస్తోంది.
