అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకులు ఎక్కువే అని చెప్పొచ్చు..అంటే ఫైర్ అంటే…నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తూ….ప్రతిపక్షాలని కట్టడి చేయడం కాదు…ఏకంగా బూతులు తిట్టడమే..ఇక బూతులు మాట్లాడటంలో వైసీపీ నేతలు ఆరితేరిపోయారని చెప్పొచ్చు..సరే ఇంకా ఆ విషయం పక్కనబెడితే…మొన్నటివరకు కొందరు నేతలు మంత్రి వర్గంలో ఉండి..ఏ స్థాయిలో చంద్రబాబుని తిట్టారో తెలిసిందే…ఇక మళ్ళీ కొత్త మంత్రివర్గంలో వచ్చిన వారు కూడా తాము కూడా తిట్టడంలో ఏ మాత్రం తక్కువ కాదని నిరుపుంచుకునే ప్రయత్నం చేశారు.

ఇక ఈ విషయంలో మంత్రి జోగి రమేశ్ ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలని గట్టిగానే ట్రై చేస్తున్నారు….అసలు మంత్రి పదవి దక్కించుకోవడం కోసం జోగి ఎన్ని రకాల స్టంట్స్ వేశారో అందరికీ తెలిసిందే..సరే చివరికి మంత్రి పదవి దక్కింది…మరి మంత్రి దక్కితే ప్రజలకు సేవ చేయడంలో ముందుండాలి…కానీ జోగి…బాబుని తిట్టడంలో ముందున్నారు…తాజాగా కూడా ప్రెస్ ముందుకొచ్చి…బాబుని తిట్టారు…అది కూడా ఇళ్ల స్థలాలు..ఇళ్ళు గురించి…వాటిని బాబు ఏదో అడ్డుకుంటున్నారని విమర్శించారు.

అసలు ఇళ్ల స్థలాల్లో ఎన్ని రకాల అక్రమాలు జరిగాయో అందరికీ తెలిసిందే…అలాగే సెంటు, సెంటున్నర స్థలాల్లో ఎలాంటి ఇళ్ళు కట్టిస్తున్నారో తెలిసిందే…సరే ఇళ్ల గురించి వదిలేస్తే…జోగి…అదే పనిగా బాబుని తిట్టేశారు. అసలు బాబు….14 ఎల్లల్లో ఒక్క స్థలం…ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు…అంటే విమర్శలు ఎంత గుడ్డిగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు…బాబు ఏం చేశారో జనాలకు తెలుసు..పైగా టీడీపీ ఆరిపోయే దీపం అని, వైసీపీ బలమైన శక్తిగా అవతరించబోతుందని మాట్లాడారు.

ఇప్పుడు రాష్ట్రంలో బలపడుతుంది ఎవరి..ఆరిపోయే దీపం మాదిరిగా ముందుకెళుతుంది ఎవరో జనాలకు క్లారిటీ ఉంది…ఇంకో విషయం చెప్పాలంటే జోగి…తన సొంత నియోజకవర్గం పెడనలో ఆరిపోయే దీపం మాదిరిగానే ముందుకెళుతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో జోగి మళ్ళీ గెలిస్తే గొప్పే అని అక్కడ జనమే మాట్లాడుకునే పరిస్తితి….ఈ సారి పెడనలో జోగి గెలవడం కష్టమే అని తెలుస్తోంది…అంటే ఆరిపోయే దీపం ఎవరో బాగా క్లారిటీ ఉందని చెప్పొచ్చు.

Discussion about this post