వైసీపీలో మంత్రుల వ్యవహారం ఎప్పటికప్పుడు.. చర్చనీయాంశంగా మారుతోంది. రెండున్నరేళ్ల తర్వాత.. మంత్రి వర్గ మార్పు ఉంటుందని సీఎం జగన్ ఆదిలోనే చెప్పిన నేపథ్యంలో కొందరు మంత్రులు తమ పదవులు ఉంటాయో… లేదో అనే బెంగతో .. జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తమ శాఖలపై తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. మరికొందరు మాత్రం చేతివాటం బాగానే చూపిస్తున్నారట. ముఖ్యంగా విజయవాడకు చెందిన మంత్రి మాత్రం తన దూకుడును ఏమా త్రం తగ్గించలేదని స్పష్టంగా చెబుతున్నారు.

ఆయన దూకుడు.. ఆదిలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉందని అంటున్నారు. వాస్తవానికి ఈ రెండున్నరేళ్ల కాలంలో సదరు మంత్రిపై అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఉద్యోగుల్లోనూ ఆయనపై వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా.. ప్రతి పనికీ చేతులు తడపాల్సి వస్తోందని.. మంత్రి వర్యుల సోదరుడు కూడా రంగంలోకి దిగి.. ముడుపులు తీసుకుంటున్నారని వైసీపీలో నూ పెద్ద ఎత్తు న చర్చ సాగు తోంది. ఈ క్రమంలో.. కొంత మేరకు మంత్రి జాగ్రత్తలు తీసుకున్నా.. అవి ఏమాత్రం గాడిలో పడలేదు. అయినప్పటికీ .. తన సామాజిక వర్గంలో పట్టు పెంచుకున్న నేపథ్యంలో అధిష్టానం కూడా ఆయనను చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు మరో గుసగుస వినిపిస్తోంది. అంటే.. ఎన్ని చేసినా.. తన సామాజిక వర్గంలో పట్టు.. ప్రతిపక్షంపై దూకుడు ఉంటే.. పార్టీ తనను అన్ని రూపాల్లోనూ.. ఆదుకుంటుందని.. సదరు మంత్రి వర్యులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ.. మంత్రి వర్గంలో చోటు పదిలం కాదనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.

అయితే.. మధ్యలోనే మంత్రిని తీసేయడం ద్వారా.. సదరు సామాజిక వర్గంలో వ్యతిరేకత వస్తుందనో.. లేక.. బ్యాడ్ సంకేతాలు.. వస్తాయనో కాదట.. ఆయన చేసిన కొన్ని మంచి పనులతోపాటు.. ఇతర పార్టీలకు ఛాన్స్ ఇవ్వరాదనే ఉద్దేశంతో మంత్రిని కొనసాగిస్తున్నారని.. అంటున్నారు. అంటే.. మంత్రిగారికి అధిష్టానం వద్ద జోష్ ఉన్నప్పటికీ ప్రయోజనం లేదనే చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Discussion about this post