వైసీపీ వాళ్లకు మాత్రమే కాకుండా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సైతం ఫ్యీజులు ఎగిరిపోయే న్యూస్ గోదావరి జిల్లాలో వినిపిస్తోంది. జగన్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న ఒక నేత ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ముందు తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సదరు మంత్రి వైసీపీలో పేరుకు మాత్రమే మంత్రిగా ఉన్నారు… మంత్రిగా ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. చివరకు తన శాఖలో మాత్రమే కాకుండా… తన నియోజకవర్గంలో కూడా చిన్నచిన్న పనులు కూడా చేయించుకోలేని దీన స్థితిలో ఉన్నారని వైసీపీ నేతలే కొద్దిరోజులుగా చెవులు కొరుక్కుంటున్నారు.

ఆ మంత్రికి తన శాఖలో పనులు, నిర్ణయాలు కూడా ఆ మంత్రికి తెలియకుండా అయిపోతున్నాయి అన్న అసంతృప్తి కూడా ఉందట. పేరుకు మాత్రమే మంత్రిగా ఉన్నా… కనీసం నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తనను సంప్రదించడం లేదని మంత్రి ఆవేదనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార వైసీపీ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది.

మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి అన్న మాట ఎక్కడ వినిపించటం లేదు. ఈ క్రమంలోనే సదరు మంత్రికి కూడా వచ్చే ఎన్నికల్లో అసలు వైసిపి గెలుస్తుందా ? చివరకు తన నియోజకవర్గంలో తాను అయినా ఎమ్మెల్యేగా అయినా గెలుస్తానా ? అన్న సందేహం వచ్చేసిందట. దీంతో సదరు మంత్రి టిడిపిలో తనకు ఉన్న పాత పరిచయాలను ఉపయోగించుకుని ఎన్నికలకు కాస్త ముందుగానే నేను టిడిపిలోకి వచ్చేస్తాను కాకపోతే ముందుగానే సీటు రిజర్వ్ చేస్తారా అని కొందరు కీలక నేతలతో టచ్‌లోకి వచ్చేశారట.

మరోవైపు చంద్రబాబు మాత్రం వలస పక్షులకు పార్టీలో ఏ మాత్రం స్థానం ఉండదని చెబుతున్నారు. వలస పక్షులకు ఈ సారి సీట్లు ఉండవనే అంటున్నారు. అయితే సదరు మంత్రి మాత్రం వైసీపీలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదని డిసైడ్ అయిపోయి… టీడీపీలోకి వచ్చేందుకు తహతహలాడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం గోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Discussion about this post