ఉన్నది లేనట్లుగా..లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి…అబద్దాలు ప్రచారం చేయడం, నెగిటివ్ చేయడం లాంటి అంశాల్లో వైసీపీని మించిన పార్టీ లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే వైసీపీ చేసే ప్రచారం అబద్దమైన..అందులో నిజం తెలుసుకునేలోపు అంతా అయిపోతుంది. అంత టాలెంట్ వైసీపీకి ఉందనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఎన్ని రకాలుగా అబద్దాలు ప్రచారం చేసి టిడిపిని నెగిటివ్ చేసి..వైసీపీ గెలిచిందో అందరికీ తెలిసిందే.
అయితే ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి కూడా వైసీపీ అదే తరహాలో ముందుకెళుతుంది. తాజాగా టిడిపి మినీ మేనిఫెస్టోపై అదే తరహాలో నెగిటివ్ ప్రచారం చేస్తుంది. ప్రజలని ఆకట్టుకునేలా చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళలు, యువత, రైతులకు ప్రత్యేక హామీలు ఇచ్చారు. ఇవి జనంలోకి విస్తృతంగా వెళ్ళాయి. వీటి పట్ల వారు ఆకర్షితులైతే వైసీపీకే దెబ్బ.అందుకే వెంటనే వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోయారు. వరుసపెట్టి చంద్రబాబుని తిట్టడం మొదలుపెట్టారు.

ప్రతి ఒక్కరూ మీడియా సమావేశం పెట్టడం బాబుని తిట్టడం అదే పనిలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో చంద్రబాబు చాలా హామీలని అమలు చేయలేదని, ప్రజలని మోసం చేశారని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. కానీ గతంలో బాబు చాలావరకు హామీలు అమలు చేశారు..కాకపోతే వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ చాలా హామీలని విస్మరించారు. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, ధరలు తగ్గుదల, జాబ్ క్యాలెండర్, పథకాలలో కోతలు..ఇలా చాలా రకాలుగా మాట తప్పారు.
ఇక ఇప్పుడు జగన్ సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని టిడిపి వాళ్ళు అంటున్నారని, మరి బాబు పథకాలు ఇస్తే లంక అవ్వదా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. అప్పులు చేస్తూ, ప్రజలపై పన్నుల భారం పెంచి..ఆదాయం సృష్టించకుండా పథకాలు ఇస్తే శ్రీలంకే అవుతుందని, కానీ బాబు ఆదాయం సృష్టించి పథకాలు ఇస్తారని అంటున్నారు. మొత్తానికి వైసీపీ నెగిటివ్ ప్రచారానికి టిడిపి గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది.