ఏపీలో వైసీపీ ప్రభుత్వం , వైసీపీ నేతలు అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదు. ఎన్నికలకు ముందు… ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒకలా ఉంటున్నాయి… ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చేస్తున్న పనులు మరోలా ఉంటున్నాయి. ఉద్యోగుల పెన్షన్ విషయంలో ఆ పార్టీ కీలక నేత సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ తాము విశ్రాంత ఉద్యోగుల విషయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు చేయాలని చూస్తే టెక్నికల్గా సాధ్యం కావడంలేదని… రాష్ట్ర బడ్జెట్ కంటే అవి ఎక్కువగా ఉంటున్నాయని చెప్పటం చాలా కామెడీగా ఉంది.

ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సితో పాటు తమకు కావలసిన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే వైసిపి నేతలు ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం ఉద్యోగులను టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగులు తమ దగ్గర అన్ని లక్షల ఓట్లు ఉన్నాయి… ఇన్ని లక్షల ఓట్లు ఉన్నాయని బెదిరింపులకు దిగడం సరి కాదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు జగన్‌ను ఉద్యోగుల వ్యతిరేకిగా ముద్ర వేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని వారు ప్రతిపక్షాలతో కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులకు టైం కు జీతాలు రావడం లేదు. అసలు ఎప్పుడు వస్తాయో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. మరోవైపు పెన్షన్ల విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది. వీటి కోసం పోరాడుతున్న ఉద్యోగులపై జగన్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు ఇలా విరుచుకుపడటం సరికాదన్న విమర్శలు వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ప్రభుత్వంపై ఇప్పటికే ఉద్యోగుల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంటే.. ఉద్యోగులపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని వైసీపీ వాళ్లు చెపుతుండడం ఘోరమనే చెప్పాలి.

Discussion about this post