May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీ నేతల నీతులు..ఆ ఎమ్మెల్యేలు ఎవరు?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 స్థానాల్లో వైసీపీ, ఒక స్థానంలో టీడీపీ గెలిచింది. అయితే 7 స్థానాలని వైసీపీ గెలుచుకోవాలని బరిలో దిగింది. కానీ వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేయడంతో టి‌డి‌పి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ గెలిచారు. ఇక టి‌డి‌పి గెలవడంతో వైసీపీ నేతలు నీతులు చెప్పడం మొదలుపెట్టారు. అదిగో తమ ఎమ్మెల్యేలని చంద్రబాబు ప్రలోభ పెట్టి తీసుకున్నారు. ఇలాంటివి ఆయనకు అలవాటే అంటూ మాట్లాడుతున్నారు.

అసలు అధికారంలోని టి‌డి‌పి ప్రలోభ పెట్టడం ఏంటి..అధికారంలో ఉన్న వైసీపీ ప్రలోభాలు, బెదిరింపులు, కక్ష సాధింపులు ప్రజలకు తెలియదనుకుని వైసీపీ నేతలు అనుకుంటున్నట్లున్నారు. ఇక టి‌డి‌పి నుంచి నలుగురు ఎమ్మెల్యేలని, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యేని లాక్కున్న విషయం ప్రజలకు తెలియదని అనుకున్నారు. అంటే తాము ఏది చెబితే అదే ప్రజలు నమ్మేస్తారని అనుకున్నారు. అసలు వైసీపీ వాస్తవ బలం 151..టి‌డి‌పి బలం 23, జనసేన 1 ఎమ్మెల్యే.

7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఒక్కో స్థానం గెలవాలంటే 22 ఎమ్మెల్యేలు కావాలి. అంటే 154 ఉంటే 7 స్థానాలు గెలవచ్చు. కానీ వైసీపీకి 151 ఉన్నారు. అయితే టి‌డి‌పి నుంచి నలుగురు, ఒక జనసేన ఎమ్మెల్యేలని తీసుకుని 156 బలం పెంచుకున్నారు. దీంతో 7 స్థానాలు గెలిచేయవచ్చని అనుకున్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు టి‌డి‌పి నుంచి అభ్యర్ధిని పెట్టారు. దీంతో వైసీపీపై అసంతృప్తిగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు టి‌డి‌పికి ఓటు వేశారు. దీంతో టి‌డి‌పి గెలిచింది. అంటే నలుగురు టి‌డి‌పి నుంచి వైసీపీకి వెళితే..నలుగురు వైసీపీ నుంచి టి‌డి‌పికి ఓటు వేశారు. దీంతో లెవెల్ అయింది. అది మర్చిపోయి ప్రలోభ పెట్టారని నీతులు చెప్పడం వల్ల జనం నమ్మే పరిస్తితి లేదు.