“మా దంతా ఒకటే కుటుంబం. జగమంత కుటుంబం.. జగనన్న కుటుంబం“ ఇదీ.. తాజాగా మంత్రి వర్గంలో సీట్లు దక్కించుకోలేక పోయిన వారి మాట. కొన్ని రోజులు అసంతృప్తితో రగిలిపోయినా.. తర్వాత.. ఎక్కువ మంది మీడియా ముందుకు వచ్చి చెప్పిన మాట. దీంతో ఇక, పార్టీలో సమస్యలు సమసి పోయా యని.. పార్టీ పుంజుకుంటుందనే సంకేతాలు బయటకు వచ్చినట్టు అయింది. అయితే.. కొందరు మాత్రం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూ.. వైసీపీలో అందరూ ఒకేలా లేరని వ్యాఖ్యానిస్తున్నారు.

కొందరు పార్టీలో పైకి ఒకవిధంగా అధినాయకుడి మెప్పుకోసం ప్రయత్నాలు చేస్తున్నారని.. కానీ, క్షేత్రస్థా యిలో పార్టీని బలహీన పరుస్తున్నారని.. అంటున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను చాలా మంది తప్పు పడుతున్నారు. మరికొందరు.. అంతర్గత చర్చల్లో.. తమను వలంటీర్లే గెలిపించాలని కోరుతున్నారు. అంటే.. ఇప్పటి వరకు చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వీరు ఇష్టపడడం లేదా.. తమకు ప్రమేయం లేని ఈ విషయంలో తాము జోక్యం చేసుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? అనేది ప్రశ్న.

ఇక, మరో కీలక విషయం. జగనేమో.. మీరు పార్టీని గెలిపించాలని అంటుండడం. కానీ, క్షేత్రస్థాయిలో నాయకులు.. అలానే అంటూ.. జగన్ పక్కకు తిరగగానే.. పార్టీనే తమను గెలిపించాలని భావించడం.. పైగా.. ఇప్పుడు జనంలోకి రమ్మంటున్నారు కాబట్టి.. మరింత ఖర్చులు పెరిగే అవకాశం ఉందని.. పైగా ఎండాకాలం కావడంతో అనుకున్న విధంగా ప్రజల్లో తిరరిగే పరిస్థితి కూడా లేదని.. కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో వైసీపీలో అసలు ఏం జరుగుతోందనే చర్చ జరుగుతోంది.

పార్టీ కావాలి.. పార్టీ గెలవాలి.. అనుకునే నాయకులు. ఇలానేనా వ్యవహరించేది ? అని ప్రశ్నిస్తున్నారు. అ యితే.. దీనికి ఎక్కడా నాయకుల నుంచి అనుకున్న స్పందన రావడం లేదు. పైకి మాత్రం జగన్ భజన చేస్తున్నారు. లోలోన మాత్రం పార్టీని డైల్యూట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యం లో పార్టీ ఏవిదంగా ముందుకు సాగుతుందని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూసుకున్నా.. ఈ పరిణామాలను మార్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post