టీడీపీ అదినేత కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌కు గ్రాఫ్ పెరుగుతోందా? ఆయన పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారా? పరిపక్వత గల నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకుంటున్నారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. అయితే..ఇది కొంత వైసీపీ వల్ల కూడా వచ్చిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని.. నారా లోకేష్ ప్రకటించారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఇక్కడ ఆయన ఓడిపోయారు.

దీంతో నియోజకవర్గం మార్చుకోవాలనే సూచనలు వచ్చాయి. కానీ, లోకేష్ మాత్రం పట్టుబట్టి ఇక్కడే గెలలుస్తానని శపథం చేశారు. అనుకున్న విధంగా ఆయన మంగళగిరిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నా రు. ఈ క్రమంలో తరచుగా ఇక్కడ పర్యటిస్తున్నారు. ఇటీవల విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా.. నియోజక వర్గంలోని గ్రామాలకు కూడా వెళ్లారు. ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్నారు. వారికి భరోసా కల్పించేలా ప్రసంగాలు కూడా చేస్తున్నారు. ఇవి.. గతానికి ఇప్పటికి లోకేష్‌లో వచ్చిన మార్పును చూపిస్తున్నాయి.

ఇక, మంగళగిరిలో లోకేష్‌కు జనాలు మొగ్గు చూపుతుండడానికి మరో కారణం కూడా ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. స్థానికంగా రెండు సార్లు వరుసగా విజయం దక్కించుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి పట్ల వ్యతిరేక త పెరుగుతుండడం ఒక కారణమైతే.. ఆయన క్షేత్రస్థాయిలో సమస్యలు వదిలేసి.. ఎంత సేపూ కక్ష పూరిత రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని.. ప్రతి చోటా చర్చ జరుగుతోంది. ఇది లోకేష్‌కు కలిసి వస్తోంది. ఎందుకంటే. రెండు సార్లు గెలిపించిన ప్రజలు తమకు ఏదైనా చేస్తారని.. ఆశించడం సహజం.

కానీ, ఆళ్ల మాత్రం అధినేత మెప్పుకోసమే పనిచేస్తున్నారన్న భావన కనిపిస్తోంది. ఇది.. ఆయనకు మైనస్ అవుతుండడం.. లోకేష్‌కు కలిసి వస్తుండడం గమనార్హం అంటున్నారు పరిశీలకులు. అదేసమయంలో గతంలో తనే స్వయంగా ప్రజలకు కనిపించిన ఆళ్ల.. ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో తనకు ప్రాధాన్యం లేకపోవడంతో.. ఇంటికే పరిమితం అవుతున్నారు.

ఎవరు వెళ్లినా.. స్పందన ఉందిగా.. దానిలో సమస్యలు చెప్పుకోవచ్చుగా! అని సమాధానం ఇస్తున్నారట. దీంతో ప్రజలు ఇప్పుడు మెల్లగా లోకేష్ వైపు దృష్టి పెడుతున్నారు. వచ్చే రెండేళ్లలో లోకేష్ మరింత స్పీడుగా ఇక్కడ పర్యటనలు చేస్తే.. గెలుపును రాసిపెట్టుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post