May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలకు ఊహించని షాక్..ఈ సారి కష్టమే!

వైసీపీ అంటే రెడ్డి వర్గం..రెడ్డి వర్గం అంటే వైసీపీ అనే పరిస్తితి ఉందని చెప్పవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రెడ్డి వర్గం హవా ఏ స్థాయిలో పెరిగిందో తెలిసిందే. అలాగే వైసీపీ నుంచి అత్యధిక స్థాయిలో రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచారు. దాదాపు 50 మంది వరకు రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారంటే..వైసీపీలో రెడ్డి వర్గం అండ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక్కరంటే ఒక్కరూ కూడా టి‌డి‌పి నుంచి రెడ్డి నేత గెలవలేదు.

అయితే అలా వైసీపీ నుంచి గెలిచిన రెడ్డి ఎమ్మెల్యేలు..ఈ సారి ఎన్నికల్లో కూడా సత్తా చాటుతారా? అంటే చెప్పడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక రెడ్డి నేతల హవా పెరిగింది గాని..రెడ్డి వర్గానికి పెద్దగా న్యాయం జరిగినట్లు కనిపించలేదు. ఏదో కొంతమంది రెడ్డి నేతలే బాగుపడ్డారు తప్ప..రెడ్డి వర్గానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. దీంతో సొంత వర్గంలో కూడా వైసీపీకి అసంతృప్తి ఉందని చెప్పవచ్చు.

దీంతో ఈ సారి రెడ్డి వర్గం ఎమ్మెల్యేలకు షాక్ తప్పదని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున రెడ్డి ఎమ్మెల్యేలు గెలిచారు. ఉదాహరణకు నెల్లూరులో 10 సీట్లు ఉంటే అందులో 7 గురు రెడ్డి ఎమ్మెల్యేలే. కడప సంగతి చెప్పాల్సిన పని లేదు. అలా ఊహించని విధంగ రెడ్డి నేతలు గెలిచారు. కానీ ఈ సారి ఆ స్థాయిలో గెలవడం కష్టం. మెజారిటీ స్థాయిలో మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంది గాని..గత ఎన్నికల మాదిరిగా ఈ సారి గెలవడం కష్టమని చెప్పవచ్చు. ఈ సారి టి‌డి‌పి నుంచి రెడ్డి నేతలు సత్తా చాటేలా ఉన్నారు.