రాష్ట్రంలో అధికార వైసీపీ నేతల తీరు మరీ అడ్డుగోలుగా ఉందని, అసలు టీడీపీ వైపు ఎవరు నిలబడ్డ వారిని ఇబ్బంది పెట్టడమో లేక వారిని బూతులు తిట్టడమే వైసీపీ నేతల పనిగా ఉన్నట్లు ఉందని విశ్లేషకులు అంటున్నారు. అసలు వైసీపీపై గాని, జగన్ పై గాని ఎలాంటి విమర్శలు చేయకుండా కేవలం చంద్రబాబుని సపోర్ట్ చేసిన సరే..అలా సపోర్ట్ చేసే వారిని తిట్టడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిపోయింది.

అయితే ఇటీవల చంద్రబాబుకు సపోర్ట్ గా నిలిచిన సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ నేతలు ఏ విధంగా విరుచుకుపడుతున్నారో తెలిసిందే. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 28న విజయవాడలో ఓ కార్యక్రమం జరిగింది. దానికి చంద్రబాబు, రజనీకాంత్, బాలకృష్ణ అతిధిలుగా వచ్చారు. ఈ క్రమంలో రజనీకాంత్..ఎన్టీఆర్ గొప్పతనం గురించి, ఆయనతో ఉన్న పరిచయం గురించి చెబుతూనే..చంద్రబాబుతో ఉన్న తనకున్న అనుబంధం గురించి చెప్పారు. అలాగే చంద్రబాబు ఓ విజనరీ నాయకుడు అని మాట్లాడారు.

ఇంకా అంతే వైసీపీ నేతలు..రజనీకాంత్‌ని తిట్టడం మొదలుపెట్టారు. మొదట కొడాలి నాని..రజనీకాంత్ సన్యాసి అంటూ దారుణంగా మాట్లాడారు. యథావిధిగా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పాత రికార్డుని వినిపించారు. ఆ తర్వాత లక్ష్మీపార్వతి, జోగి రమేష్ లాంటి వారు తమ నోటికి పనిచెప్పారు. అయితే జగన్ పై గాని, వైసీపీ పై గాని రజనీకాంత్ విమర్శలు చేయలేదు. చంద్రబాబుని పొగిడారు.
అంటే అలా చేయడం వల్ల రజనీ మాటలు విని ప్రజలు చంద్రబాబు వైపు వెళ్తారని అనుకుని ఉంటారు..అందుకే రజనీకాంత్ ని తిడితే..ఇంకా ప్రజలు రజనీ మాటలు నమ్మరు కదా అనే కోణంలో వైసీపీ స్కెచ్ వేసింది. కానీ అదే వైసీపీకి రివర్స్ అయింది. అనవసరంగా రజనీని తిట్టి ప్రజల్లో ఇంకా నెగిటివ్ పెంచుకున్నారు. దీని వల్ల వైసీపీకే రిస్క్ పెరిగింది.