ఏపీలోని వైసీపీ సర్కారుకు మరో సెగతగులుతోంది. ఎన్నికలకు ముందు.. ఈ సెగ భారీగా పెరిగే సూచన లు కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 22 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. ఇవి సామాజిక వర్గాలకు విభిన్నం. వివిధ శాఖలకు సంబంధించి.. జగన్ ప్రభుత్వం ఈ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. లిడ్ క్యాప్, ఏపీఐఐసీ, పౌరసరఫరాలు, చేనేత.. ఇలా మొత్తం 22 కార్పొరేషన్లు ఉన్నాయి. వీటికి చైర్మన్‌లుగా.. చైర్‌పర్సన్‌లుగా.. వైసీపీకి చెందిన కీలక నాయకులను నియమించారు.

దీంతో అటు కార్పొరేషన్ల రూపంలో వారు బాగా పనిచేసి.. ఆయా రంగాల్లో రాణించి.. ఇటు పార్టీ పరంగా ఆయా చైర్మన్లు పనిచేసి.. పార్టీని బలోపేతం చేస్తారని అధిష్టానం ఆశించింది. ఈ క్రమంలోనే అత్యంత సీనియర్ మోస్ట్ నాయకులను ఆయా కార్పొరేషన్లకు చైర్మన్‌లుగా నియమించింది. అయితే.. వీరికి .. ఆయా శాఖల డైరెక్టర్లకు మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయింది. నిధులు.. ఆదేశాలు.. కార్యక్రమాలు ఇలా ఎలా చూసుకున్నా.. డైరెక్టర్లకు.. చైర్మన్లకు మధ్య ఆధిపత్యం పెరిగి.. వివాదాలకు దారితీస్తోంది.

ఇటీవల ఈ విషయాన్ని లిడ్ క్యాప్ చైర్మన్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. చైర్మన్‌గా ఉన్నప్పటికీ.. తనకు ఎలాంటి అధికారాలు లేవని.. కనీసం.. తన కుర్చీని తనే తుడుచుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక, ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి కూడా తనకు డైరెక్టర్ నుంచి మంచి మర్యాద లభిస్తోందని.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ క్రమంలోనే ఆయన తన జీతాన్ని త్యాగం చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే.. ఇది నిరసనలో ఒక భాగం. ఇలాంటి వారు చాలా మందే కనిపిస్తున్నారు.

దీంతో వీరిపై జగన్ పెట్టుకున్న ఆశలు కరిగిపోతాయనే వాదన వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అన్ని కోణాల్లోనూ.. పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన వ్యూహాత్మకం గా అడుగులు వేసినా.. డైరెక్టర్లు వ్యవహరిస్తున్నతీరుతో చైర్మన్లు హర్ట్ అవుతున్నారు. దీనినినివారించాలని.. వారు కోరుతున్నారు. ఎందుకంటే.. వచ్చే రెండేళ్లలోనే తాము ఏమైనా చేయాలని అనుకున్నది చేయగలమని.. అలా చేయలేక పోతే.. అనుకున్న విధంగా ఫలితం రాదని చైర్మన్లు అంటున్నారు. సో, దీనిని బట్టిజగన్ వేసే అడుగులే ఇప్పుడు కీలకంగా మారనున్నాయి.

Discussion about this post