చంద్రబాబు-పవన్ కలవడంపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ ప్యాకేజ్ కోసం బాబుని కలిశారని, బాబు-పవన్ కలిసిన జగన్‌ని ఏం చేయలేరని ఫైర్ అవుతున్నారు. అదే సమయంలో కాపుల ఓట్లని పవన్…బాబుకు తాకట్టు పెడుతున్నారని, ఇంకా జనసేన శ్రేణులు టీడీపీ జెండాలు మోయడానికి రెడీగా ఉండాలని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంటే పరోక్షంగా టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య కుల చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఇదే క్రమంలో వైసీపీపీ చేసే విమర్శలని సేమ్..అలాగే వివాదాస్పద డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ చేశారు. ఇప్పటికే ఈయన వైసీపీ కోసం సీక్రెట్‌గా పనిచేస్తున్నారనే విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు కూడా వర్మ ద్వారా వైసీపీ చేసిన రాజకీయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వర్మ అదే బాటలో వెళుతున్నారు. తాజాగా బాబు-పవన్ కలవడంపై వర్మ ట్వీట్ చేశారు. “కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు” అంటూ ట్వీట్ చేశారు.

అంటే కమ్మ నేతల కోసం కాపులు పనిచేస్తున్నారనే విధంగా చెప్పుకొచ్చారు. అంటే కమ్మ-కాపు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా రాజకీయం చేస్తున్నారని తెలుస్తోంది. గత ఎన్నికల ముందు వీరి ట్రాప్ లో టీడీపీ-వైసీపీ శ్రేణులు పడ్డాయి. కానీ ఇప్పుడు వారు రివర్స్ అవుతున్నారు. వైసీపీ చేసే కుట్రల్లో భాగంగానే వర్మ పనిచేస్తున్నారని, జగన్ వేసే పేటీఏం డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నారని, పక్కా వైసీపీ స్క్రిప్ట్‌ని ఫాలో అవుతున్నారని..వర్మ పోస్ట్ కింద టీడీపీ-జనసేన శ్రేణులు కామెంట్లు పెడుతున్నాయి. అంటే వైసీపీ, వర్మ ట్రాప్‌లో టీడీపీ-జనసేన శ్రేణులు పడటం లేదు.

Leave feedback about this