అధికార వైసీపీలో ఎక్కడకక్కడ కుమ్ములాటలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. నేతలు మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. ఆయా నియోజకవర్గాల్లో పట్టు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేయడంతో ఆధిపత్య పోరు పెరిగిపోయింది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకోవడమే కాకుండా…సొంత పార్టీ నేతల నుంచి కూడా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారు. సొంత పార్టీ నేతలే…ఎమ్మెల్యేలపై విమర్శలు చేస్తున్నారు. ఇలా లుకలుకలు ఉన్న నియోజకవర్గాలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై స్పెషల్‌గా సర్వే చేస్తున్నట్లు తెలిసింది.

ముఖ్యంగా ఇటీవల రచ్చ నడుస్తున్న నియోజకవర్గాల్లో సర్వే జరుగుతున్నట్లు తెలుస్తోంది. పాయకరావుపేట, తాడికొండ, గూడూరు, దర్శి, పార్వతీపురం, నగరి, కర్నూలు సిటీ, నందికొట్కూరు, చిలకలూరిపేట లాంటి నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇవేకాకుండా ఇంకా ఆధిపత్య పోరు నడుస్తున్న స్థానాలపై వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టి పనిచేస్తుంది.

అలాగే సర్వేల్లో ఎమ్మెల్యేలకు నెగిటివ్ వస్తే..వారిని నెక్స్ట్ ఎన్నికల్లో తప్పించడానికి కూడా వైసీపీ అధిష్టానం వెనుకడుగు వేయదని తెలుస్తోంది. ఇప్పటికే పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు గళం విప్పుతున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే ఏ మాత్రం పనిచేయడం లేదని చెప్పేస్తున్నారు. అటు దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిల మధ్య ఎంత రచ్చ జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు.


ఇక నగరిలో రోజాకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు గళం విప్పుతున్నారు. రోజాపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. నందికొట్కూరు గురించి చెప్పాల్సిన పని లేదు. మొదట నుంచి ఎమ్మెల్యే ఆర్థర్‌కు, బైరెడ్డి సిద్ధార్థ్‌కు పెద్దగా పడటం లేదు. చిలకలూరిపేటలో రజినికి, మర్రి రాజశేఖర్ వర్గానికి పడటం లేదు. ఇలా రచ్చ జరుగుతున్న నియోజకవర్గాల్లో పార్టీని లైన్‌లో పెట్టడానికి సర్వేలు చేస్తున్నట్లు తెలిసింది.

Discussion about this post