వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం టార్గెట్‌గా ఎలాంటి రాజకీయం నడిపిందో అందరికీ తెలిసిందే. విశాఖ రూరల్‌లో సత్తా చాటిన వైసీపీ, విశాఖ సిటీలో చతికిలపడటంతో, సిటీని దక్కించుకోవడానికి అనేక వ్యూహాలతో ముందుకొచ్చింది. అక్కడ టీడీపీని దెబ్బతీయడానికి గట్టిగానే ప్రయత్నించింది. ఈ క్రమంలోనే మూడు రాజధానులని తీసుకొచ్చి..విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విశాఖలో వైసీపీకి తిరుగుండదని అంతా అనుకున్నారు.

కానీ మొత్తం రివర్స్ అయింది… ఆ ప్రకటన వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతుంది. అయినా సరే రాజధాని ముందుకు కదలడం లేదు. ఒకవేళ తర్వాత రాజధాని ఏర్పాటు చేసినా సరే విశాఖ ప్రజలు వైసీపీ పట్ల పెద్దగా పాజిటివ్‌గా ఉండే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అనుకున్న మేర విశాఖపై వైసీపీ పట్టు సాధించినట్లు కనిపించడం లేదు. విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ని వైసీపీలో చేర్చుకున్న సరే పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి.ఇప్పటికే రూరల్‌లో పరిస్తితి మారుతుంది…ఇటు సిటీలో కూడా వైసీపీకి అనుకూలంగా పరిస్తితి ఏమి లేదనే చెప్పాలి. ముఖ్యంగా విశాఖ పార్లమెంట్‌లో వైసీపీకి అనుకూల వాతావరణం కనిపించడం లేదు. టీడీపీకి మరీ పట్టు ఏమి తగ్గలేదు. ఇంకా వచ్చే ఎన్నికల నాటికి పరిస్తితి మరింత మారే అవకాశం కూడా లేకపోలేదు.ఒకవేళ టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుంటే విశాఖ పార్లమెంట్‌లో వైసీపీకి బొమ్మే. ఎందుకంటే విశాఖ పరిధిలో ఉన్న ఏడు స్థానాల్లో వైసీపీకి గెలవడం కష్టమైపోతుంది. ఇప్పటికీ విశాఖ సిటీలోని నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీకి అంత సానుకూల వాతావరణం ఏమి లేదు. విశాఖ నార్త్‌లో తప్ప, మిగిలిన చోట్ల వైసీపీకి అంత పట్టు పెరిగినట్లు లేదు. ఇటు భీమిలిలో పూర్తిగా రాజకీయం మారిపోయింది.

నెక్స్ట్ ఇక్కడ టీడీపీ పైచేయి సాధించేలా ఉంది. అటు గాజువాకలో టీడీపీ-జనసేనలు కలిస్తే వైసీపీకి ఓటమి తప్పదు. శృంగవరపుకోటలో అయితే టీడీపీకి లీడింగ్ వచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తానికైతే విశాఖలో వైసీపీ స్ట్రాటజీలు రివర్స్ అయ్యాయనే చెప్పాలి.
Discussion about this post