రెడ్డి సామాజికవర్గం అంటే కేవలం వైసీపీనే కాదు..రెడ్డి వర్గానికి వైసీపీ ఏమి బ్రాండ్ అంబాసిడర్ కాదనే చెప్పాలి. కాకపోతే వైసీపీలో కొందరు రెడ్లకే ప్రాధాన్యత ఉంటుంది..అందుకే వైసీపీని రెడ్ల పార్టీ అంటారు. అలా అని టిడిపిలో రెడ్డి వర్గం వాళ్ళు లేరని కాదు. టిడిపిలో రెడ్డి నేతలు ఉన్నారు. టిడిపిని సపోర్ట్ చేసే రెడ్డి ఓటర్లు ఉన్నారు.
అయితే గత ఎన్నికల్లో టిడిపికి మద్ధతు ఇచ్చే రెడ్లు కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు. దీంతో టిడిపి నుంచి ఒక్క రెడ్డి నాయకుడు గెలవలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు..తప్ప రెడ్డి వర్గానికి న్యాయం జరగలేదు. వైసీపీ వచ్చాక రెడ్లు చాలావరకు నష్టపోయిన పరిస్తితి. అందుకే వారిలో కూడా మార్పు వస్తుంది. వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నారు. రెడ్డి వర్గం ప్రభావం ఉన్న తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి గెలిచిదంటే రెడ్డి వర్గం మద్ధతు ఏ మేరకు దక్కిందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక గత ఎన్నికల్లో టిడిపి తరుపున పోటీ చేసి ఓడిపోయిన రెడ్డి నేతలు ఈ సారి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. వైసీపీని ఓడించాలనే కసితో ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిడిపి లో రెడ్డి నేతలు వైసీపీపై రివేజ్ కోసం కాచుకుని కూర్చున్నారు. ఇక్కడ టిడిపిలో ఉన్న బీసీ జనార్ధన్ రెడ్డి-బనగానపల్లె సీటులో, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి-కర్నూలు ఎంపీ సీటులో, సుబ్బారెడ్డి-డోన్, కోట్ల సుజాతమ్మ-ఆలూరు, భూమా అఖిలప్రియ-ఆళ్లగడ్డ, భూమా బ్రహ్మానందరెడ్డి-నంద్యాల, గౌరు చరితా రెడ్డి-పాణ్యం, బుడ్డా రాజశేఖ రెడ్డి-శ్రీశైలం, తిక్కారెడ్డి-మంత్రాలయం, జయనాగేశ్వరరెడ్డి-ఎమ్మిగనూరు ఇలా చూసుకుంటే రెడ్డి నేతలు వైసీపీని ఓడించాలనే కసితో ఉన్నారు. వీరే కాదు చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని టిడిపి రెడ్డి నేతలు వైసీపీని ఓడించాలని చూస్తున్నారు.
