జనసేన అధినేత గత కొన్ని రోజులు నుంచి ఒకే నినాదంతో ముందుకెళుతున్నది వైసీపీ విముక్త ఏపీ..ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అనే కాన్సెప్ట్ తో పవన్ ముందుకెళుతున్నారు. అయితే పవన్ ఒక్కరికే..వైసీపీని ఓడించడం సాధ్యమవుతుందా? అంటే అది సాధ్యం అవ్వని పని డౌట్ లేకుండా చెప్పవచ్చు. అదే సమయంలో వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని చెబుతున్నారు కదా..బిజేపితో పొత్తులో ఉంటూ ఓట్లని చీలనివ్వకుండా వైసీపీకి చెక్ పెట్టగలరా? అంటే అది అసలు జరిగే పని కాదు.

ఎందుకంటే ఏపీలో బిజేపికి ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. అలాంటప్పుడు బిజేపితో ఉపయోగం లేదు. కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉండటం బిజేపికి కలిసొచ్చే అంశం..పవన్ సైతం అందుకే బిజేపిని వదిలిపెట్టడం లేదు. ఇక తాజాగా పవన్ ఢిల్లీకి వెళ్ళి..కొనధరు బిజేపి పెద్దలతో మాట్లాడారు. వారితో కూడా వైసీపీ విముక్త ఏపీ కోసం పోరాడాలని చెప్పారని అంటున్నారు. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండటమే తమ ఎజెండా అని, అదే బిజేపి ఎజెండా అని చెప్పుకొచ్చారు.
అయితే వ్యతిరేక ఓట్లు చీలకూడదు అంటే బిజేపి, జనసేన పొత్తు పెట్టుకుంటే సరిపోదు టిడిపితో కూడా కలవాలి. కానీ పవన్ రెడీగానే ఉన్నారు..బిజేపి మాత్రం టిడిపితో కలవడానికి సిద్ధంగా లేదు. ఇదే క్రమంలో పవన్..2014 ఎన్నికల కాంబినేషన్ గురించి బిజేపి పెద్దలతో మాట్లాడినట్లు తెలిసింది. అంటే టిడిపి, జనసేన, బిజేపి కలిసి ఎన్నికలకు వెళ్ళేలా బిజేపి పెద్దలతో మాట్లాడరట.
కానీ అందుకు బిజేపి అంగీకరించలేదని తెలిసింది..బిజేపి సొంతంగా బలపడాలని అనుకుంటుందని జేపి నడ్డా తెలిపారట. జనసేనతో కలిసి బలపడితే ఇంకా మంచిదని అన్నారట. అయితే టిడిపి లేకుండా వైసీపీ విముక్త ఏపీ అవ్వని పని.. మరి బిజేపితో పెట్టుకుంటే ఆ పని అవ్వదు. మరి పవన్ పొత్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
