రాజకీయాల్లో గెలుపోటములని తారుమారు చేయగల సత్తా ఉన్నది కేవలం మహిళలకే అని చెప్పాలి. వారు తలుచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. అయితే రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు కూడా మహిళా నాయకులు ఎదుగుతున్నారు. ఇక గత ఎన్నికల్లో ఏపీ లో వైసీపీ నుంచే మహిళా నాయకులు ఎక్కువ గెలిచారు. టిడిపి నుంచి కేవలం ఒక్కరు మాత్రమే గెలిచారు. రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి భవాని గెలిచారు.
ఇక భవాని తప్ప..టిడిపి నుంచి పోటీ చేసిన మహిళా నాయకురాళ్ళు ఓడిపోయారు. అయితే ఈ సారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ పట్టు వదిలేలా లేరు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన మహిళా నేతలు..ఈ సారి గెలుపు దిశగా ముందుకెళుతున్నారు. అలా గెలుపు వైపు వెళుతున్న వారిలో శ్రీకాకుళంలో గుండా లక్ష్మీ ఉన్నారు. ఈమె తక్కువ ఓట్లతో ధర్మాన ప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ధర్మానకు చెక్ పెట్టే దిశగా వెళుతున్నారు. అటు పలాసలో గౌతు శిరీష…ఈ సారి మంత్రి సీదిరి అప్పలరాజుని ఓడించాలనే కసితో పనిచేస్తున్నారు.
ఇక విజయనగరం అసెంబ్లీలో అతిథి గజపతి రాజు గెలుపు ఖాయమే. సాలూరులో గుమ్మడి సంధ్యారాణి, పాడేరులో గిడ్డి ఈశ్వరి, రంపచోడవరంలో వంతల రాజేశ్వరి..గెలుపు కోసం ఇంకా పోరాడాలి..ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీ బలంగా ఉంది. అటు పాయకరావుపేటలో వంగలపూడి అనిత గెలుపుకు దగ్గరలో ఉన్నారు.
నందిగామలో తంగిరాల సౌమ్యకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ఆలూరులో కోట్ల సుజాతమ్మ ఈ సారి గెలుపు ఖాయమే. ఆళ్లగడ్డలో అఖిలప్రియ, పాణ్యంలో గౌరు చరితారెడ్డి కాస్త కష్టపడాలి. మొత్తానికి ఈ సారి టిడిపి నుంచి ఎక్కువ మందే మహిళా నేతలు గెలిచే ఛాన్స్ ఉంది.