May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

ఆత్మకూరులో వైసీపీకే లీడ్..ఆనంతో టీడీపీకి కలిసొస్తుందా!

ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం..తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు లేని స్థానం. ఇక్కడ అసలు టి‌డి‌పి గెలిచింది..కేవలం రెండుసార్లు మాత్రమే…1983, 1994 ఎన్నికల్లోనే అక్కడ గెలిచింది. ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలిచింది. ఇక గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి గెలిచిన విషయం తెలిసిందే. కానీ గత ఏడాది ఆయన గుండెపోటుతో మరణించారు.

దీంతో ఆత్మకూరుకు ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో వైసీపీ నుంచి మేకపాటి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. అప్పుడు టి‌డి‌పి పోటీ చేయలేదు. ఇలా ఉపఎన్నికలో గెలిచిన విక్రమ్ రెడ్డి వల్ల ఆత్మకూరుకు ఒరిగింది ఏమి లేదు. పెద్దగా అక్కడ అభివృద్ధి లేదు. కానీ అక్కడ మేకపాటి ఫ్యామిలీకి పట్టు ఉంది. దీంతో ఆత్మకూరులో వైసీపీ బలం తగ్గడం లేదు. తాజా సర్వేల్లో కూడా ఆత్మకూరులో వైసీపీకే ఆధిక్యం ఉందని తేలింది.

అయితే ఇక్కడ బలమైన అభ్యర్ధి కోసం టి‌డి‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే ఆనం రామ్ నారాయణ రెడ్డి కుమార్తె కైవల్య రెడ్డి టి‌డి‌పిలోకి వచ్చారు. ఆమె ఆత్మకూరు సీటు ఆశిస్తున్నారు. ఇదే తరుణంలో ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి బయటకొచ్చారు. ఎన్నికల ముందు ఆయన టి‌డి‌పి లో చేరే ఛాన్స్ ఉంది. ఇక టి‌డి‌పిలో చేరితే..ఆయనకు ఆత్మకూరు సీటు దక్కే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆయన కుమార్తెకు సీటు ఇస్తే..ఆనం వేరే సీటులో పోటీ చేయవచ్చు.

కానీ అక్కడ ఆనం ఫ్యామిలీకి పట్టుంది. 2009లో ఆనం కాంగ్రెస్ నుంచి ఆత్మకూరుల గెలిచారు. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో మేకపాటి వర్సెస్ ఆనం ఫ్యామిలీల మధ్య వార్ జరిగే ఛాన్స్ ఉంది. చూడాలి మరి ఆత్మకూరులో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.