సొంత పార్టీతోనే ఒక వైసీపీ ఎంపీ నానా ఇబ్బందులు పడుతున్నారా? అసలు ఎమ్మెల్యేలు సహకరించకపోవడంపై ఆ ఎంపీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? జగన్ నిర్ణయాలు ఆ ఎంపీకి నచ్చడం లేదా? ఆఖరికి అధికార పార్టీలో ఉన్నా సరే పనులు చేయించుకోలేని స్థితిలో ఆ ఎంపీ ఉన్నారా? అంటే నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు అదే పరిస్తితుల్లో ఉన్నారని తెలుస్తోంది.

పేరుకు వైసీపీ ఎంపీ అయినా సరే లావు..మొదట నుంచి న్యూట్రల్‌గానే ఉంటూ వచ్చారని చెప్పొచ్చు..సొంత పార్టీలో అన్యాయం జరిగిన ప్రశ్నిస్తారు కూడా…అలాగే అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులతో మాట్లాడినా ఏకైక వైసీపీ నాయకుడు కూడా ఈయనే. ఇలా తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్న శ్రీకృష్ణకు…చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినితో పెద్దగా పొసగదనే సంగతి తెలిసిందే. శ్రీకృష్ణ…మర్రి రాజశేఖర్ వర్గానికి సపోర్ట్‌గా ఉండటంతో…విడదల వర్గం గుర్రుగా ఉంది. అసలు మొదట నుంచి శ్రీకృష్ణకు రజిని వర్గం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అలాగే అనేకసార్లు ప్రోటోకాల్ విషయంలో రచ్చ కూడా నడిచింది.

ఇక ఈ మధ్య వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సొంత పార్టీ కార్యకర్తనే అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే…ధాన్యం గురించి ప్రశ్నించారని చెప్పి ఆ రైతుని అరెస్ట్ చేయించారు. ఇలా తప్పుడు కేసుతో అరెస్ట్ చేయించడంపై రైతు కోసం ఎంపీ డైరక్ట్‌గా గుంటూరు జిల్లా ఎస్పీతోనే డైరక్ట్‌గా మాట్లాడారు. రైతుని అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. అలా బొల్లాతో ఎంపీకి క్లాష్ వచ్చింది.

అదే సమయంలో గుంటూరు నగరంలో ఉన్న తన పార్టీ కార్యలయం ముందు రోడ్డు కూడా వేయించుకోలేని స్థితిలో శ్రీకృష్ణ ఉన్నారని తెలుస్తోంది..అధికారులు ఏ మాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో శ్రీకృష్ణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. అలాగే గతంలో హోదా, పోలవరం, రైల్వే జోన్‌లాంటి అంశాలపై జగన్ పోరాటం చేసి, ఇప్పుడు సైలెంట్‌గా ఉండటంపై కూడా ఎంపీ అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి శ్రీకృష్ణకు వైసీపీలో పెద్దగా సెట్ అవ్వడం లేదని తెలుస్తోంది. మరి నెక్స్ట్ ఈయన రాజకీయాలకు దూరం అవుతారా? లేక వైసీపీకి దూరం అవుతారో క్లారిటీ లేదు.

Discussion about this post