May 28, 2023
ap news latest AP Politics TDP latest News Uncategorized YCP latest news

వైసీపీకి బాబు దెబ్బ..అదిరే లాజిక్‌లు..టీడీపీకి కావాల్సింది ఇదే!

గత కొంతకాలంగా టీడీపీని ఇరుకున పెట్టాలని చూస్తున్న వైసీపీని చంద్రబాబు మామూలు దెబ్బకొట్టలేదు. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటులో ఓడిపోయినా సరే..వైసీపీ టి‌డి‌పిని దెబ్బకొట్టడానికి డైవర్షన్ పాలిటిక్ చేస్తూ ఫేక్ రాజకీయాలు చేస్తూ వస్తుంది. పదే పదే తమ పార్టీ ఎమ్మెల్యేలని కొన్నారని, దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలని, టి‌డి‌పి అధికారంలోకి వస్తే సంక్షేమం ఆపేస్తుందని..ఇక టి‌డి‌పి-జనసేన మధ్య చిచ్చు పెట్టేలా ఫేక్ రాజకీయం చేయడం..ఇలా ఒకటి వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది.

ఇక వైసీపీ రాజకీయాన్ని టి‌డి‌పి శ్రేణులు కూడా తిప్పికొట్టడానికి చూస్తున్నాయి..కానీ పూర్తి స్థాయిలో ఆ పనిచేసినట్లు కనిపించలేదు. కానీ తాజాగా చంద్రబాబు ఆ పని పూర్తి చేశారు. వైసీపీ చేసే ప్రతి రాజకీయానికి కౌంటర్ ఇచ్చారు. మొదట ఎమ్మెల్యేలు కొన్నారనే అంశంపై కౌంటర్ ఇస్తూ.. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ పార్టీ ఎన్ని కోట్లు ఇచ్చి కొనుగోలు చేసిందని గట్టిగా ప్రశ్నించారు. అలాగే ‘‘దేవుడి స్ర్కిప్ట్‌ అన్నారు. ఏమయ్యింది? మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 22 ఓట్లు వస్తే మాకు ఒక ఎమ్మెల్సీ వస్తుంది. ఆ సీటు మాకు వదిలేస్తే పోయేది కదా? ఎందుకు పోటీ పెట్టారు? నువ్వు ఎదుటి పార్టీ వారిని తీసుకొంటే నీతి… మాకు ఎవరైనా ఓట్లు వేస్తే అవినీతా?” అంటూ బాబు ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చేశారు.

ఇక దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలని జగన్ చేస్తున్న సవాల్‌పై స్పందిస్తూ..అసలు తాము ఎన్ని సీట్లలో పోటీ చేస్తే జగన్ కు ఎందుకు..అడగడానికి జగన్ ఎవరు? అని ప్రశించి..175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే తమ టార్గెట్ అన్నారు. ఈ మధ్య జగన్ తాను పేదల పక్షమని, పేదలకు..పెత్తందార్ల మధ్య పోరాటం జరుగుతుందని అంటున్నారు. దానిపై కూడా బాబు స్పందిస్తూ.. ఇసుకలో నెలకు రూ.250 కోట్లు దోచుకొంటున్నవాడు పేదల ప్రతినిధా? అని ఫైర్ అయ్యారు.

అలాగే సంక్షేమం అనేది టి‌డి‌పితో మొదలైందని, తాము అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం చేస్తామని, రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాలు.. చివరకు వ్యక్తుల మధ్యా వైసీపీ చిచ్చు పెడుతుందని, మహిళలని కూడా చూడకుండా వ్యక్తిత్వాన్ని కించపర్చడానికి దిగజారుతున్నారని, పోలీసులను వాడుకోవడం, ఫేక్‌ పోస్టులు పెట్టడం..ఇలా నీచమైన పనులన్నీ చేస్తున్నారని, ఎన్ని చేసినా వాళ్ల ఆట ముగిసిపోయిందని బాబు వైసీపీకి చెక్ పెట్టేలా మాట్లాడేశారు.