రాజకీయాల్లో జంపింగులు అనేవి ఒకోసారి కలిసొస్తే, ఒకోసారి నష్టం చేకూరుస్తాయని చెప్పొచ్చు. కానీ రాజకీయ నాయకులంతా ఏదో సాధించేద్దామన్నట్లే పార్టీలు మారుతారు. పార్టీలు మారిన ప్రతి ఒక్కరికీ కాలం కలిసి రాకపోవచ్చు. ఉదాహరణకు గత టీడీపీ ప్రభుత్వంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అలా మారిన వారందరికి కాలం కలిసిరాలేదు..గత ఎన్నికల్లో వారు చిత్తుగా ఓడిపోయారు. ఒకవేళ వారు వైసీపీలోనే ఉండుంటే కొందరికి మంత్రి పదవులు కూడా వచ్చేవి. కానీ పార్టీ మారి మిస్టేక్ చేశారని చెప్పొచ్చు.

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక కొంతమంది టీడీపీ నేతలు జంపింగులు చేశారు. మారి జంపింగ్ చేసిన నేతలందరి పరిస్తితి బాగుందా? అంటే కొందరిది బాగోలేదని చెప్పొచ్చు. అసలు వైసీపీలో వాళ్ళ పొజిషన్ ఏంటో అర్ధం కాకుండా ఉంది. ఇప్పుడు అలాంటి పొజిషన్ సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబుకు వచ్చిందని చెప్పొచ్చు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా ఎంట్రీ ఇచ్చిన పంచకర్ల అప్పుడు పెందుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక…అధికారంలోకి కొనసాగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితి దారుణంగా తయారవ్వడంతో గంటా శ్రీనివాసరావుతో కలిసి టీడీపీలోకి వచ్చేశారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ కంచుకోట అయిన ఎలమంచిలి నుంచి పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు బాగానే ఉన్నారు…కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన రూట్ మార్చేశారు.

మరి టీడీపీలో ఉంటే ఇబ్బంది అనుకున్నారేమో..వెంటనే వైసీపీలోకి జంప్ చేశారు. ఇక వైసీపీలోకి వెళ్ళాక ఆయనకు అనుకున్న ప్రాధాన్యత దక్కడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కుతుందో కూడా డౌటే. ఒకవేళ టీడీపీలో ఉండుంటే ఎలమంచిలి సీటు ఉండేది…పైగా అక్కడ గెలిచే ఛాన్స్ దొరికేది. ఇప్పుడు వైసీపీలో ఉండటం వాళ్ళ సీటు డౌటే. మరి చూడాలి వైసీపీలో పంచకర్ల పొజిషన్ ఎలా ఉంటుందో?\

Discussion about this post