రాష్ట్రంలో కులాల వారీగా రాజకీయాలు జరుగుతాయనే సంగతి తెలిసిందే. నేతలు కులాల ఓట్లని రాబట్టుకోవడానికి..రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఒకో పార్టీకి ఒకో కులం సపోర్ట్ గట్టిగా ఉంటుంది. ఉదాహరణకు వైసీపీకి రెడ్డి వర్గం…టీడీపీకి కమ్మ వర్గం సపోర్ట్ ఉంటుంది. కానీ గత ఎన్నికల్లో మెజారిటీ వర్గాల ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఆఖరికి కమ్మ వర్గం కూడా వైసీపీ వైపు మొగ్గు చూపింది. చాలావరకు కమ్మ ఓటర్లు వైసీపీకి మద్ధతుగా నిలిచారు. అందుకే ఆ పార్టీ తరుపున కమ్మ ఎమ్మెల్యేలు బాగానే గెలిచారు.

అలా వైసీపీ వైపు కూడా కాస్త మొగ్గు చూపిన కమ్మ ఓటర్లు ఇప్పుడు పూర్తిగా వైసీపీకి వ్యతిరేకమయ్యే పరిస్తితి వచ్చింది. ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కమ్మ వర్గం టార్గెట్‌గానే రాజకీయం నడుస్తోంది. పైగా వైసీపీలో ఉన్న కమ్మ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాంటి వారి చేత చంద్రబాబుని విపరీతంగా తిట్టిస్తున్నారు. అలాగే ఇటీవల భువనేశ్వరిపై సైతం అసభ్య రీతిలో మాట్లాడే పరిస్తితి వచ్చింది. చంద్రబాబు కన్నీరు కూడా పెట్టుకున్నారు.


ఇక ఇక్కడ నుంచి రాజకీయం మారింది. కమ్మ వర్గం అంతా ఏకమయ్యే పరిస్తితి వచ్చింది. ఆఖరికి వైసీపీలో ఉన్న కమ్మ నేతలు సైతం…తమ పార్టీ చేస్తున్న రాజకీయంపై అసంతృప్తిగా ఉన్నారు. కొడాలి, వంశీలు మినహా మిగిలిన కమ్మ నేతలు…వైసీపీపై అసంతృప్తిగానే ఉన్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ బామ్మర్ది వెంకట సుబ్బయ్య…డైరక్ట్‌గా జగన్‌పైనే విమర్శలు చేశారు. రోశయ్యని కడచూపు చూసేందుకు వెళ్ళేందుకు జగన్‌కు తీరిక లేదని ఫైర్ అయ్యారు.

అలాగే సొంత కులాన్ని కాదనుకొని కాంగ్రెస్, వైసీపీకి సేవలు చేశామని, గుండెల్లో పెట్టుకొని చూస్తామన్నవారే గుండెలపై తన్నారని అన్నారు. చంద్రబాబుపై జగన్ మీడియా దారుణమైన కథనాలని వేస్తుందని చెప్పి కూడా ఫైర్ అయ్యారు. ఈ మాటలు బట్టి చూస్తే వైసీపీ కమ్మ నేతల్లో ఎంత అసంతృప్తి ఉందో అర్ధమవుతుంది. ఈ పరిణామాలని బట్టి చూస్తే ఈ సారి కమ్మ వర్గం వన్ సైడ్ గా టీడీపీకి సపోర్ట్ ఇచ్చేలా ఉంది.

Discussion about this post