అబద్దాలకు, అసత్యాలు ప్రచారం చేయడంలో వైసీపీని మించిన రాజకీయ పార్టీ లేదనే చెప్పాలి..ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేయడం, ప్రత్యర్ధులని మానసికంగా దెబ్బకొట్టడంలో వైసీపీదే పై చేయి. అలా చేసే గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపిపై, చంద్రబాబుపై ఏ రకంగా లేనిపోని అబద్దాలు ప్రచారం చేశారో చెప్పాల్సిన పని లేదు. పింక్ డైమండ్ అని, ఒకే వర్గానికి డిఎస్‌పి పదవులు ఇచ్చారని, అమరావతిలో అక్రమాలు అని..అన్నిటికంటే వైఎస్ వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసు..ఈ రెండు ఎన్నికలని బాగా ప్రభావితం చేశాయి.
జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకాని దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ఇక మొదట ఆయన గుండెపోటుతో చనిపోయారని అన్నారు..ఆ వెంటనే హత్య అని తేలడంతో..అదిగో చంద్రబాబు ఆయన మనషులు చేయించారని జగన్ తో సహ వైసీపీ నేతలు ప్రచారం చేశారు. మరి వైసీపీ అధికారంలోకి వచ్చాక వివేకా హత్య కేసు ఏం అవుతుందో తెలిసిందే..ఇందులో సొంత వాళ్లే ఉన్నారనే విషయం బయటపడుతున్న విషయం తెలిసిందే. అప్పుడు బాబు చేయించారని చెప్పినవారే..ఇప్పుడు రకరకాల ప్రచారం చేస్తున్నారు. వివేకాకు వేరే మహిళతో సంబంధం ఉందని, అలాగే ఆస్తి తగాదాలు వల్ల జరిగిందని ప్రచారం చేస్తున్నారు. ఎన్ని ప్రచారాలు చేసినా వివేకాని ఎవరో చంపారో..చంపించారో జనాలకు క్లారిటీ వచ్చింది.

ఇక కోడి కత్తి కేసు..సరిగ్గా 2019 ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన..విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీను అనే వ్యక్తి..జగన్ భుజంపై కోడి కత్తితో గుచ్చాడు. అదిగో జగన్ ని బాబు చంపించాలని చూశారని ప్రచారం చేశారు. దీన్ని ప్రజలు నమ్మారు..కానీ ఇప్పుడు ఏమైంది.. జగన్‌పై వైజాగ్‌లో జరిగిన కోడికత్తి దాడి ఘటనలో ఎలాంటి కుట్రకోణంలేదని దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టులోని రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్ ప్రసాద్‌కు ఈ సంఘటనతో ఏ సంబంధం లేదని, నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కాదని తెలినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇక దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. అంటే రెండు కేసులతో బాబుపై ఎలా దుష్ప్రచారం చేసి జగన్ లబ్ది పొందారో అర్ధమైంది. కానీ ఇవే ఇప్పుడు జగన్‌కు రివర్స్ అవుతున్నాయి.