వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..వైసీపీకి చెక్ పెట్టేలా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీలో జరుగుతున్న తప్పులని రఘురామ ఎత్తిచూపారు. కానీ అవి ఆయనకే రివర్స్ అయ్యాయి. వైసీపీ నేతలు ఆయనపై ఫైర్ అయ్యారు. జగన్‌తో మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో అప్పటినుంచి రఘురామ రెబల్ గా మారి..వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. రఘురామ వర్సెస్ వైసీపీ సర్కార్ అన్నట్లు పోరు నడుస్తోంది.

అయితే ఎలాగైనా రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ ట్రై చేస్తుంది..ఓ సారి అరెస్ట్ అయ్యారు..తర్వాత బయటకొచ్చారు..ఆయనపై వేటు వేయించాలని చూశారు. అది వర్కౌట్ కాలేదు. ఇక వచ్చే ఎన్నికల్లోనైనా రఘురామని నిలువరించాలని వైసీపీ చూస్తుంది. కానీ వైసీపీకి మించిన స్కెచ్‌లతో రఘురామ ముందుకొస్తున్నారు. ఈ సారి టీడీపీ-జనసేనల పొత్తులో పోటీ చేస్తానని చెబుతున్నారు. అంటే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయమని రఘురామ ఫిక్స్ అయ్యారు.

ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే రఘురామ గెలుపు సులువు. నరసాపురంలో టీడీపీ-జనసేన కలిస్తే..వైసీపీకి చెక్ పడిపోతుంది. ఇక పొత్తులో భాగంగా నరసాపురం సీటు ఎవరికి దక్కితే..ఆ పార్టీ నుంచి రఘురామ పోటీ చేసే ఛాన్స్ ఉంది. కాకపోతే గత ఎన్నికల్లో నరసాపురం నుంచి జనసేన తరుపున పోటీ చేసి ఓడిపోయారు.

ఈ సారి కూడా ఆయన అక్కడ నుంచే పోటీ చేస్తే..రఘురామ మరొక సీటు చూసుకోవాలి. లేదా నాగబాబు పోటీ చేయకపోతే రఘురామకు వచ్చే ఇబ్బంది లేదు. నరసాపురం నుంచి పోటీ చేసే లక్కీ ఛాన్స్ దొరుకుతుంది. చూడాలి మరి చివరికి రఘురామ ఎక్కడ బరిలో ఉంటారో.
