గత ఎన్నికల్లో ఆ వర్గం…ఈ వర్గం..ఆ ప్రాంతం…ఈ ప్రాంతం అనే తేడా లేకుండా అందరూ వైసీపీకి వన్‌సైడ్‌గా ఓట్లు వేశారని చెప్పవచ్చు. అందుకే వైసీపీకి అంతటి భారీ విజయం అందింది. ఆఖరికి టిడిపిపై కమ్మ పార్టీ అని ముద్రవేస్తారు..కానీ ఆ కమ్మ వర్గం సైతం వైసీపీ వైపే నిలిచింది. కమ్మ వర్గం సగం వరకు వైసీపీకి ఓట్లు వేసింది..అందుకే కమ్మ ప్రభావిత నియోజకవర్గాల్లో కూడా టిడిపి గెలిచింది. అయితే అధికారంలోకి వచ్చాక కమ్మ వర్గం టార్గెట్ గా వైసీపీ చేసిన రాజకీయం ఏంటో అందరికీ తెలిసిందే.

అలాంటి పరిస్తితుల్లో మళ్లీ కమ్మ ఓటర్లు వైసీపీకి ఓటు వేస్తారని అనుకోవడం పొరపాటే. వారి ప్రభావం ఎక్కువ ఉన్న స్థానాల్లో వైసీపీ గెలుపు అనేది కాస్త కష్టమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలా చూసుకుంటే కమ్మ ఓటర్ల ప్రభావం ఉండే మైలవరం, పెనమలూరు, గుడివాడ, తెనాలి, పొన్నూరు, చిలకలూరిపేట, గురజాల, వినుకొండ, పెదకూరపాడు, దెందులూరు, తణుకు, కందుకూరు లాంటి స్థానాల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు సన్నగిల్లుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇంకా కమ్మ ప్రభావం ఉన్న స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాల్లో టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

ప్రస్తుతానికి వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో ఈ సారి దెబ్బ తగిలేలా ఉంది. మళ్లీ ఆ స్థానాల్లో వైసీపీ గెలుపు కాస్త కష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దో గొప్పో గుడివాడ లాంటి స్థానంలో కాస్త టిడిపికి ఇబ్బందులు ఉండవచ్చు గాని..మిగిలిన స్థానాల్లో వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలేలా ఉన్నాయి. ఈ సారి కమ్మ బెల్టులో వైసీపీ గెలుపు గగనమయ్యేలా ఉంది.
