ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి ఏ మాత్రం పట్టు లేని స్థానం ఏది అంటే..మాచర్ల స్థానం చెబుతారు. అక్కడ టిడిపి పెద్దగా విజయాలు సాధించలేదని అంటారు. అయితే 1999 వరకు అక్కడ టిడిపి మంచి విజయాలే సాధించింది..ఆ తర్వాత నుంచే దెబ్బతింది. కానీ మాచర్ల కంటే టిడిపికి పట్టు లేని స్థానాల్లో గుంటూరు ఈస్ట్ ముందు వరుసలో ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు గుంటూరు-1గా ఉన్న ఈ సీటులో టీడీపీ గొప్ప విజయాలు అందుకోలేదు.

1983, 1994, 1999 ఎన్నికల్లోనే అక్కడ టిడిపి గెలిచింది. ఇక గుంటూరు ఈస్ట్ గా ఏర్పాడ్డాక..ఒక్కసారి కూడా గెలవలేదు. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. 2014లో గెలుపు దగ్గరకు వచ్చి కేవలం 3 వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో 22 వేల ఓట్ల తేడాతో టిడిపి ఓడింది. అయితే ఇప్పుడుప్పుడే అక్కడ సీన్ మారుతుంది. ముస్లిం ఓటర్ల ప్రభావం ఉన్న గుంటూరు ఈస్ట్ లో వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది.

వరుసగా రెండు సార్లు గెలుస్తూ వస్తున్న మహమ్మద్ ముస్తఫాకు యాంటీ పెరుగుతుంది. పైగా వైసీపీ..బీజేపీతో సీక్రెట్ గా అంటకాగడం మైనస్ అవుతుంది. అటు ఎమ్మెల్యేపై వ్యతిరేకత వస్తుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ముస్తఫా పోటీ చేయకుండా..తన కుమార్తెని బరిలో దింపాలని చూస్తున్నారు. ఇటు టిడిపి నుంచి నజీర్ ఉన్నారు. అయితే జనసేనతో పొత్తు ఉంటే ఈస్ట్ లో వైసీపీకి చెక్ ఖాయం. గత ఎన్నికల్లో టిడిపి 22 వేల ఓట్ల తేడాతో ఓడితే..జనసేనకు 21,508 ఓట్లు పడ్డాయి. అంటే టిడిపి-జనసేన కలిస్తే వైసీపీకి చెక్ పడటం ఖాయమే.


పొత్తులో భాగంగా ఈస్ట్ సీటు ఎవరికి దక్కిన వైసీపీకి ఈ సారి గెలుపు దక్కడం అనేది డౌటే.
