రాజకీయాల్లో నాయకులు వేసే ప్రతి అడుగు వెనుక ఒక ప్రయోజనం ఉంటుంది. పార్టీ నేతలు తీసుకునే నిర్ణయాల వెనుక సుదీర్ఘ లక్ష్యాలు కూడా ఉంటాయి. ఈ రెండు లేకుండా.. రాజకీయాల్లో ఉన్నవారు ఎవ రూ కూడా ఇటు పుల్లతీసి అటు పెట్టే ప్రయత్నాలు కూడా చేయరు. అయితే.. ఇవేవీ ఆలోచించుకోకుండా నే.. పార్టీకి.. రాష్ట్రానికి కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండానే.. వైసీపీఅ ధినేత జగన్ వేస్తున్న అడుగులు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. పైగా.. వైసీపీలోని సొంత నేతల నుంచి తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది.

ఇప్పటి వరకు పార్టీలో ఉన్న రాజ్యసభ సభ్యులను తీసుకుంటే.. ఒక్క విజయసాయిరెడ్డి వల్ల తప్ప.. వైసీ పీకి జరుగుతున్న లాభం అంటూ ఏమీ లేదు. ఆయన కేంద్రంలోను.. ఇటు రాష్ట్రంలోనూ పార్టీని డెవలప్ చేస్తున్నారు. కేంద్రంతో రాష్ట్ర సమస్యలపై చర్చిస్తున్నారు. అవసరమైనప్పుడు.. కేంద్రం నుంచి రాష్ట్రాని కి ఏదైనా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా.. పార్టీలోనూ.. ఆయన గట్టి వాయిస్ వినిపిస్తున్నారు. సో.. సాయిరెడ్డికి మరోసారి ప్రమోషన్ ఇవ్వడం తప్పుకాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే.. ఈయన తప్ప.. ఇతర నేతలను చూసుకుంటే.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పరిమళ్ నత్వానీ, ఇప్పు డు వెళ్తున్న ఆర్. కృష్ణయ్య సహా ఇతర నేతల వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని.. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి పరిమళ్ నత్వానికి ఇచ్చినప్పుడు.. రాష్ట్రానికి ఆయన వల్ల ఏదైనా ఒరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. పైగా కేంద్రంతో సంబంధాలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయన వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని అనుకున్నారు.

అయితే.. ఆయన వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం జరగలేదు. ఇక, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికూడా.. ఎక్కడా కనిపించరు. కేవలం పార్టీ నాయకుడి పాత్రనే పోషిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని అంటున్నారు. ఇక, ఇప్పుడు ఆర్. కృష్ణయ్యను బీసీ కోటాలో పంపిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల మేలు జరిగితే..అది ఆర్. కృష్ణయ్యకే జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగంలో ఉన్న ఆయనకు ఆరు సంవత్సరాల పాటు.. ఉద్యోగం ఇచ్చినట్టే తప్ప. రాష్ట్రానికి వైసీపీకి మేలు జరిగే సూచనలు కనిపించడం లేదని చెబుతున్నారు.


ఇక, బీద మస్తాన్ రావు కూడా గత ఎన్నికల్లో.. టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత.. వచ్చి వైసీపీలో చేరారు. పోనీ.. అప్పటి నుంచి ఆయనేమన్నా.. పార్టీలో కీలకంగా ఉన్నారా.? కనీసం.. పార్టీ తరఫున ఎప్పుడైనా ఒక సభ నిర్వహించారా…? ప్రభుత్వం తరఫున వాయిస్ వినిపిస్తున్నారా? అంటే.. ఏమీ కనిపించడం లేదు. అయినప్పటికీ.. ఆయనకు ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చారు. కానీ, రాష్ట్రంలో వైసీపీ ని ఆది నుంచి కష్టపడి అధికారంలోకి తెచ్చిన నాయకులు జగన్‌కు పనికి రాలేదా? అనేది ప్రధాన ప్రశ్న. మరి దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.

Discussion about this post