రాష్ట్ర అధికార పార్టీ వైసీపీలో తాజాగా జిల్లాల అధ్యక్షులను.. కో ఆర్డినేటర్లను, సమన్వయకర్తలను జోరుగా పెంచారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా.. గెలుపు గుర్రం ఎక్కడమే పరమావధిగా.. జగన్ వ్యూహాత్మక అడుగు లు వేశారు. అయితే.. ఈ కూర్పులో ఆయన చేసిన వ్యూహంపై పార్టీలోనే సర్వత్రా.. విమర్శలు వస్తున్నా యి. గతంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు కానీ, బీసీ నేతలను పార్టీవైపు మళ్లించిన.. ఎమ్మెల్సీ.. జంగా కృష్ణమూర్తికి కానీ.. మరో సీనియర్ నాయకుడు.. దాడి వీరభద్రరావు సహా..అనేక మందికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వలేదు.




అంతేకాదు.. పార్టీలో రెడ్డి వాసనలు తగ్గించి.. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని.. కొన్నాళ్లుగా తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా జగన్ కసరత్తు కూడా చేస్తున్నారని.. అన్నారు. అయితే.. ఇప్పుడు జరిగిన పార్టీ బాధ్యుల కూర్పులో అలాంటి ప్రక్రియ ఎక్కడా జరగలేదు. ఎందుకంటే.. పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్న సామినేని ఉదయభానుకు కానీ.. పార్టీ పుట్టిన ప్పటి నుంచి ఉన్న రక్షణ నిధి వంటి ఎస్సీ నేతలకు కానీ.. జగన్ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు.

ఈ పరిణామాలకు తోడు మహిళలకు 50 శాతం పదవులు అంటూ.. కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు.. పం చాయతీల్లో పదవులు పంచినజగన్.. పార్టీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ సూత్రాన్ని పక్కన పెట్టారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి కర్నూలును తీసుకుంటే.. మాజీ ఎంపీ బుట్టా రేణుకకు.. బీసీ వర్గాల్లో మంచి పట్టుంది. ఆమెకు పార్టీ పదవి ఇచ్చి ఉంటే.. జిల్లాలో బాధ్యతగా పనిచేసి.. ఉండేవారని అంటున్నారు. కానీ, ఆమెకు అవకాశం దక్కలేదు.

ఇక, రెడ్డి వర్గానికే పార్టీలో పదవులు కట్టబెట్టడం.. కీలకమైన.. నలుగురు రెడ్లకే.. మరిన్ని బాధ్యతలు అప్ప గించడం.. వివాదాలకు.. విమర్శలకు అవకాశం ఇస్తోంది. మరోవైపు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కు మారుడు, ఎంపీ మిథున్‌రెడ్డిలకు.. ఏకంగా 67 నియోజకవర్గాల బాధ్యత అప్పగించడంపై.. సీనియర్లు సైతం గుర్రుగా ఉన్నారు. గుంటూరుకు చెందిన మాజీ ఎంపీ.. వేణుగోపాలరెడ్డిని అసలు పట్టించుకోలేదు. ఇక, జగన్ పదే పదే చెప్పే.. మరో ఎంపీ.. అవినాష్‌రెడ్డికి ఎక్కడా ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఎలా చూసుకున్నా.. ఇటు రెడ్డి వర్గంలోనూ.. కొందరినే జగన్ నమ్ముతున్నారని వాదన వినిపిస్తోంది.

Discussion about this post