జగన్ వేవ్ కావొచ్చు…టీడీపీ మీద వ్యతిరేకత కావొచ్చు..గత ఎన్నికల్లో చాలామంది వైసీపీ తరుపున తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు జనంలో పెద్దగా ఫాలోయింగ్ ఏమి లేదు…కానీ జగన్ గాలిలో గెలిచేశారు. మరి అలా గెలిచిన ఎమ్మెల్యేలు…ఈ రెండున్నర ఏళ్లలో సొంతంగా ఫాలోయింగ్ పెంచుకున్నారా? ఎమ్మెల్యేలుగా మంచి పనితీరు కనబరుస్తున్నారా? మళ్ళీ ఎంతమంది ఎమ్మెల్యేలు రెండోసారి గెలుస్తారనే విషయాలని ఒక్కసారి పరిశీలిస్తే….కొందరు ఎమ్మెల్యేలకు అనుకున్న మేర ఫాలోయింగ్ పెరగలేదని తెలుస్తోంది.

అలాగే మంచి పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేల విషయానికొస్తే వీరిలో కొందరికి రెండోసారి గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో తొలిసారి…చిలకలూరిపేట నుంచి విడదల రజిని, శింగనమల నుంచి జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ చరణ్, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి, రంపచోడవరం నుంచి నాగులపల్లి ధనలక్ష్మీ, పాడేరు నుంచి భాగ్యలక్ష్మీ, పాతపట్నం నుంచి రెడ్ది శాంతి, పత్తికొండ నుంచి శ్రీదేవిలు గెలిచారు.




ఇటీవల బద్వేలు ఉపఎన్నికలో సుధ విజయం సాధించారు. బద్వేలు విషయం పక్కనబెడితే…మిగిలిన మహిళా ఎమ్మెల్యేల్లో ఫాలోయింగ్ తెచ్చుకున్నది రజిని, పద్మావతి మాత్రమే…మిగిలిన వారికి పెద్ద ఫాలోయింగ్ రాలేదు. అలాగే ఎమ్మెల్యేలుగా కూడా అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా తాడికొండలో శ్రీదేవి, పాతపట్నంలో రెడ్ది శాంతి, కళ్యాణదుర్గంలో రెడ్ది శాంతి లకు ఎమ్మెల్యేలుగా మంచి మార్కులు పడటం లేదని తెలుస్తోంది.



అటు పాడేరులొ భాగ్యలక్ష్మీ, రంపచోడవరంలో ధనలక్ష్మీ, పత్తికొండలో శ్రీదేవిల పనితీరు కూడా అంత గొప్పగా ఏమి లేదు. కాకపోతే ఈ నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉండటం కాస్త ప్లస్. అటు రజిని, పద్మావతిలకు ఫాలోయింగ్ ఉంది గానీ, ఎమ్మెల్యేలుగా అదిరిపోయే మార్కులు పడటం లేదు. వీళ్ళు ఇంకాస్త కష్టపడాల్సిన అవసరముంది. ఏదేమైనా ఈ సారి ఫస్ట్ టైమ్ గెలిచిన లేడీ ఎమ్మెల్యేలకు సెకండ్ టైమ్ ఛాన్స్ దొరికేలా లేదు.

Discussion about this post