Site icon Neti Telugu

వైసీపీలో లేడీ ఎమ్మెల్యేలకు చిక్కులు?

గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో సరిగ్గా ప్రజలకు అవగాహన కూడా లేని నేతలు కొందరు విజయం సాధించారనే వాదన ఉంది. అంటే జగన్ వేవ్‌లో జనం..వైసీపీ నుంచి కాస్త ఫేమ్ లేని వారిని నిలబెట్టిన సరే గెలిపించేశారని విశ్లేషకులు అంటున్నారు. అయితే అలా జగన్ ఇమేజ్ తో గెలిచిన వారు..ఎమ్మెల్యేలు అయ్యాక సొంతంగా ఇమేజ్ పెంచుకుని సత్తా చాటుతున్నారా? అంటే చెప్పలేని పరిస్తితి. ఎక్కువమంది అయితే సొంత ఇమేజ్ పెంచుకోలేదు. ఇప్పటికే జగన్ ఇమేజ్ పైనే ఆధారపడి ఉన్నారు.

ముఖ్యంగా కొంతమంది లేడీ ఎమ్మెల్యేలు జగన్ ఇమేజ్ లో గెలిచారు. ఇప్పటికీ అదే నమ్మకంతో ఉన్నారు. అంటే జగన్ ఇమేజ్ బాగుంటే మళ్ళీ వారు ఎమ్మెల్యేలుగా గెలుస్తారు లేదంటే గెలవడం కష్టం. అలా జగన్ ఇమేజ్ పైనే ఆధారపడి బండి లాగుతున్న లేడీ ఎమ్మెల్యేలు ఎక్కువగానే ఉన్నారు. వారిలో కొందరి పరిస్తితి మరీ అంత ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. ఆ ఎమ్మెల్యేలకు మళ్ళీ గెలవడం కష్టమని తెలుస్తోంది.

అయితే ఈ సారి గెలుపుకు దూరంగా జరుగుతున్న ఎమ్మెల్యేల్లో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముందు వరుసలో ఉన్నారు. గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి..జగన్ గాలిలో గెలిచారు. ఈ సారి ఆమెకు గెలుపు సంగతి పక్కన పెడితే..అసలు సీటు దక్కేలా లేదు. ఇక పాలకొండ-కళావతి, పాతపట్నం-రెడ్డి శాంతి, పాడేరు-భాగ్యలక్ష్మీ, రంపచోడవరం-ధనలక్ష్మీ, పత్తికొండ-శ్రీదేవి, కళ్యాణదుర్గం-ఉషశ్రీ చరణ్, శింగనమల-పద్మావతి..ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది లేడీ ఎమ్మెల్యేలకు ఈ సారి పాజిటివ్ కనిపించడం లేదు.

ఇటు సీనియర్ లేడీ ఎమ్మెల్యేల్లో రోజా, పుష్పశ్రీ వాణి, సుచరిత, వనిత లాంటి వారి పరిస్తితి కూడా ఆశాజనకంగా లేదు. మొత్తానికి చూస్తే ఈ సారి కొంతమంది లేడీ ఎమ్మెల్యేలకు గెలుపు కష్టమయ్యేలా ఉంది.

Exit mobile version