ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలు తమ బాధ ఎవరికీ చెప్పుకోవడంలేదు. అసలు పార్టీలో ఉండాలా ?బయటకు రావాలా అన్నది కూడా తేల్చుకోలేక వారు సతమతమవుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. చాలామంది ఇది ఎంపీ లు, ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ప్రజల పనులు, తమ నియోజకవర్గ సమస్యలు అలా ఉంచితే… కనీసం తమ సొంత పనులు కూడా చేసుకోలేని దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఎవరో వేళ్ళ మీద లెక్క పెట్టేలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి ఒకరిద్దరు మంత్రులు మినహా మిగిలిన ఎవ్వరికీ ప్రభుత్వంలో పనులు కావడం లేదు అన్నది వాస్తవం.

ఇక ఎంపీలు అసలు తాము ఎందుకు ఉన్నామో కూడా అర్థం కాని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. చాలామంది ఎంపీలకు ముఖ్యమంత్రి దర్శన భాగ్యం కలగడం లేదు. ఇక ఎంపీలు కూడా తమకు నిధులు లేకపోవడంతో ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఒకరిద్దరు ఎంపీలు ప్రజల్లోకి వెళ్ళినా తమకు చెప్పకుండా ఎందుకు వస్తున్నారంటూ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎంపీలు పూర్తిగా డమ్మీలు అయిపోయారు.

పార్టీ అధిష్టానం తీరుపై తీవ్రంగా రగిలిపోతున్న ముగ్గురు ఎంపీలు ఎప్పుడైనా పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు రెడీ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లిస్టులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తో పాటు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి – గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మాగుంట వైసీపీ అధిష్ఠానంతో దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎక్కువగా ఢిల్లీలో , చెన్నై లో ఉంటూ తన వ్యాపారాలు చక్కబెట్టుకుంటున్నారు.

ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే అసలు నెల్లూరు జిల్లాలో ఉండటం లేదు. ఆయన కూడా తన వ్యాపారంలో పూర్తిగా బిజీ అయిపోయారు. ఇక లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే చివరకు తన విజ్ఞాన్ విద్యా సంస్థలకు రావలసిన బకాయిలు కూడా ప్రభుత్వం నుంచి విడుదల చేయించుకోలేని దీన స్థితిలో ఉన్నారు.

మరోవైపు తన పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నుంచి ప్రోటోకాల్ గౌరవం కూడా లేకపోవడంతో అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో లావు కూడా టైం చూసి పార్టీపై తన కసి తీర్చుకుంటారు అని తెలుస్తోంది. ఈ ముగ్గురు ఎంపీలే కాదు ఈ లిస్టులో చాలా మంది వైసీపీ నేతలు ఉన్నట్టు సమాచారం.

Discussion about this post