May 31, 2023
ap news latest AP Politics

వైసీపీలో ఆర్జీవి ‘వ్యూహం’..బాబు టార్గెట్‌గా..వింత అదే?

ఎన్నికల దగ్గరపడుతుండటంతో ప్రశాంత్ కిషోర్ టీం వ్యూహాలు రెడీ అవుతున్నాయి..మళ్ళీ టీడీపీని దెబ్బతీసి అధికారం దక్కించుకోవడానికి వైసీపీ చూస్తుంది. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా సృష్టించి వ్యూహాలు చేయడంలో వైసీపీని మించిన పార్టీ లేదు. గత ఎన్నికల ముందు టీడీపీని దెబ్బతీయడం కోసం ఎలాంటి వ్యూహాలు వేసిందో చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా అబద్దాలు ప్రచారం చేశారు.

కమ్మ వర్గానికి డీఎస్పీ పదోన్నతులు, చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్, కోడి కత్తి కేసు, వివేకా హత్య కేసు..ఇలా ప్రతిదానిలో బాబుని టార్గెట్ చెస్ దెబ్బతీశారు. ఇక కొందరు బాబుపై విషప్రచారం చేసి..వైసీపీకి సహకరించారు. ముద్రగడ పద్మనాభం, రమణ దీక్షితులు, మోత్కుపల్లి నరసింహులు, రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, కత్తి మహేష్..అబ్బో ఒకరంటే చాలామంది చేత నెగిటివ్ ప్రచారం చేయించారు.

వీరిలో రామ్ గోపాల్ వర్మ చేత లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయించి బాబుని ఎలా నెగిటివ్ చేశారో అందరికీ తెలిసింది. వర్మ సైతం..చంద్రబాబు, లోకేష్‌లపై విషప్రచారం చేశాడు. ఇవన్నీ అప్పుడు నెగిటివ్ అయ్యి టీడీపీ ఓటమికి, వైసీపీ విజయానికి కృషి చేశాయి. ఇక  నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలవడానికి కూడా వైసీపీ అదే తరహా వ్యూహాలతో ముందుకెళుతుంది.  ఇప్పటికే అధికార బలంతో నానా రకాలుగా టీడీపీని తొక్కడానికి చూస్తున్నారు. ఇక కమ్మ-కాపు వర్గాల మధ్య కుల చిచ్చు పెట్టేలా రాజకీయం చేస్తున్నారు. ఇటీవల బాబు సభల్లో దురదృష్ట ఘటనలు జరిగి 11 మంది చనిపోయారు. దీన్ని అడ్డం పెట్టుకుని రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టకూడదని జీవో తెచ్చారు. ఇదంతా వైసీపీ కుట్రలాగే ఉందని టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి.

ఇదే క్రమంలో వర్మ మరోసారి ఎంట్రీ ఇచ్చాడు..ఇప్పటికే వ్యూహం అనే సినిమా తీస్తున్నాడు. అలాగే తాజాగా తొక్కిసలాట ఘటనపై స్పందిస్తూ.. ఎక్కువమంది జనాలు పెద్ద గ్రౌండ్‌లో పెడితే రారని.. పాపులారిటీ తగ్గిపోతుందని అందరికి తెలిసిపోతుందనే భయంతో ఇలా చేశారని, చిన్న ప్రాంతాల్లో సమావేశాలు పెడితే బాగా కనిపిస్తుందని.. వచ్చినవాళ్లకు చంద్రబాబు కానుకల పేరుతో.. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు పిలిచారని ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన పాపులారిటీ పెంచుకోవడం కోసం..జనాలని ఎక్కువ తీసుకొచ్చి ప్రచారం చేసుకోవాలని చూశారని,..బాబు నరహంతకుడు అని, ఇకపై బాబుని మీరు అనని, నువ్వు అంటానని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.

ఇక ఆ ఘటనలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు..వారికి బాబు ఎలా అండగా నిలబడ్డారో తెలుసు. కానీ ఆర్జీవీ..గత కొన్ని రోజులుగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలే చేశారు. అంటే వైసీపే స్క్రిప్ట్‌ని పక్కగా ఆర్జీవీ అమలు చేశారు. ప్రచార పిచ్చితో దేనికైనా తెగించే ఆర్జీవీ ఇలా విమర్శలు చేయడం వింతగానే ఉంది. 

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video