ఒకోసారి రాజకీయంగా వచ్చే కొన్ని స్టేట్‌మెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయని చెప్పొచ్చు..అసలు ఆ స్టేట్‌మెంట్స్ రాజకీయాలనే మార్చే అవకాశం కూడా ఉంటుంది..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నటుడు శివాజీ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై చర్చ పెద్దగానే జరుగుతుంది. ఆయన ఎప్పటినుంచో అమరావతి ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే..ఇక తాజాగా అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఆయన..అమరావతి రైతుల దగ్గరకొచ్చారు.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో సీఎం తన స్థానాన్ని గెలుచుకోవడానికే గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుందని, ఓటుకు రూ.50వేలు ఇచ్చినా ఈసారి వైసీపీ గెలిచే పరిస్థితి లేదని అన్నారు. ఇక ఇందులో వైసీపీ గెలుస్తుందా? లేదా? అనే విషయం పక్కన పెడితే…ఇప్పుడు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఏ పార్టీతో టచ్‌లో ఉన్నారు..ఆ ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ నడుస్తోంది.

ఏదో సుమారుగా 50, 60 మంది ఎమ్మెల్యేలు అంటే ఏదో రాజకీయంగా చెప్పారని అనుకుంటాం..కానీ అదేదో పక్కాగా లెక్క చెబుతున్నట్లు 49 మంది అంటున్నారు. అంటే ఈయన రాజకీయం కోసం చెప్పారా? లేక నిజంగానే 49 ఎమ్మెల్యేలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా శివాజీ మాటలని వైసీపీ పైకి లైట్ తీసుకున్నట్లే కనిపించిన…లోపల మాత్రం అసలు ఆ 49 మంది ఎమ్మెల్యేలు ఎవరనే అంశంపై ఆరా తీస్తున్నట్లు కనిపిస్తోంది

.
ఎందుకంటే ఇప్పటికే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్తితి ఉంది…ఇలాంటి సమయంలోనే శివాజీ..49 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని అన్నారు..ఇక్కడ వేరే పార్టీ అంటే టీడీపీనే అంతా అనుకుంటున్నారు. శివాజీ అన్నట్లు నిజంగానే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లోకి వచ్చారా అనేది చూడాలి.

Discussion about this post