ఈ మధ్య అధికార వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే వరుసపెట్టి షాక్ ఇస్తున్నారు. సొంత ప్రభుత్వం పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామన్ అని, వైసీపీ ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షం చేసే విమర్శలకు వైసీపీకి నెగిటివ్ పెరిగింది..ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం వల్ల వైసీపీకి ఇంకా మైనస్ అవుతుంది.

అయితే అలా విమర్శలు చేసే ఎమ్మెల్యేలకు వైసీపీ చెక్ పెడుతుంది..aa మధ్య జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన వెంకటగిరి ఎమ్మెలే ఆనం రామ్ నారాయణరెడ్డికి చెక్ పెట్టిన విషయం తెలిసిందే. వెంకటగిరికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. ఇటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆయనని జగన్ పిలిపించుకుని మాట్లాడారు. అయినా సరే కోటంరెడ్డి తగ్గలేదు..ఆఖరికి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని, వచ్చే ఎన్నికల్లో గిరిధర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని, తమ్ముడికి పోటీగా తాను నిలబడనని, తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతానని అన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని.. దీంతో తన మనోభావాలు దెబ్బతిన్నాయని, అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో కోటంరెడ్డి వైసీపీని వీడటం ఖాయమని ప్రచారం జరుగుతుంది.అదే సమయంలో ఆయన టిడిపిలోకి వస్తారని కథనాలు వస్తున్నాయి. అయితే పక్కా ప్లాన్ ప్రకారమే కోటంరెడ్డి టిడిపిలోకి వస్తారని, టిడిపిలో ఉంటూ జగన్ కోవర్టు మాదిరిగా పనిచేసే అవకాశాలు ఉన్నాయని, టిడిపి సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. కాబట్టి కోటంరెడ్డిని టిడిపిలో చేర్చుకోకూడదని డిమాండ్ వస్తుంది. చూడాలి మరి కోటంరెడ్డి రాజకీయ పయనం ఎలా ఉంటుందో.
