నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తోంది. అయితే పొత్తు ఉంటే మాత్రం ఖచ్చితంగా జనసేనకు టిడిపి కొన్ని సీట్లు ఇవ్వాలి. కాకపోతే ఈ సీట్ల లెక్కలపై ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని సీట్లు జనసేనకు ఇవ్వడానికి టిడిపి రెడీ అయిందని తెలుస్తోంది. ఆ సీట్లలో ఉన్న టిడిపి నేతలకు చంద్రబాబు ముందుగానే హింట్ ఇచ్చారని తెలుస్తోంది.

పొత్తు ఉంటే మాత్రం ఆ సీట్లలో టిడిపి నేతలు తప్పుకోవాల్సి వస్తుంది. అయితే ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు సీటు సైతం పొత్తులో భాగంగా జనసేనకే దక్కుతుందని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. దీంతో అక్కడ ఉన్న టిడిపి నేత జయమంగళ వెంకటరమణ సీటు దక్కదని తెలుసుకుని..వైసీపీలోకి జంప్ చేశారు. రమణ జంప్ తో కైకలూరు సీటు జనసేనకు ఇవ్వడానికి టిడిపికి ఉన్న ఇబ్బందులు తగ్గాయని చెప్పవచ్చు.

అయితే 2009లో కైకలూరు నుంచి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన జయమంగళకు 2014 ఎన్నికల్లో సీటు దక్కలేదు. పొత్తులో భాగంగా అప్పుడు బిజేపికి సీటు దక్కింది. 2019 ఎన్నికల్లో జయమంగళ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టిడిపి ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. కానీ కైకలూరులో టిడిపిని బలోపేతం చేయడంలో విఫలమయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేకపోయారు.

ఇక నెక్స్ట్ ఈయన సీటు దక్కదని తేలిపోయింది. పొత్తు ఉంటే ఖచ్చితంగా కైకలూరు సీటు జనసేనకు ఇస్తారని తేలింది. దీంతో జయమంగళ జంప్ కొట్టారు. వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేశారని సమాచారం. జయమంగళ వైసీపీలోకి వెళ్ళిన సరే కైకలూరులో టీడీపీ-జనసేన పొత్తు ఉంటే..వైసీపీ గెలవడం కష్టమనే చెప్పాలి.
