పొరాటాల గడ్డ అయిన ప్రకాశం జిల్లా పరుచూరులో ఒకప్పుడు ఆధిపత్య రాజకీయాలు, కక్షాపూరిత రాజకీయాలు రాజ్యమేలేవి. అయితే గత ఏడెనిమిదేళ్లుగా పరుచూరులో సరికొత్త రాజకీయం కనిపిస్తోంది. అక్కడ గత కాలపు కుట్రలు, కళ్లు రాజకీయాలు కనుమరుగైపోయాయి. ఏలూరి సాంబశివరావు ఎప్పుడు అయితే పరుచూరు రాజకీయాల్లో ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి పరుచూరు ప్రశాంతతకు మారుపేరుగా మారింది. ఒకరిద్దరు నేతలు ఎప్పుడూ అసంతృప్తితోనో, అసమ్మతితోనో ఉండడం మామూలే అయినా.. పరుచూరులో పార్టీలు, వర్గాలు, మతాలతో సంబంధం లేని అభివృద్ధిని ఏలూరి సాంబశివరావు చేసి చూపిస్తున్నారు.

గాదె వెంకటరెడ్డి, ఎం. నారాయణరావు, దగ్గుబాటి చౌదరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జాగర్లమూడి లక్ష్మీపద్మావతి లాంటి సీనియర్ రాజకీయ నేతలు ప్రాథినిత్యం వహించిన పరుచూరును ఏలూరి ఇప్పుడు తన కంచుకోటగా మార్చేసుకున్నారు. ఇదేదో ఒకటి రెండు రోజులో, నెలల్లోనే వచ్చింది కాదు.. ఏడెనిమిది సంవత్సరాలుగా ఎంతో కష్టపడితేనే ఏలూరికి ఈ రోజు పరుచూరు అడ్డా అయ్యింది. దశాబ్దాలుగా పరుచూరులో మహామహులు కూడా చేయని అభివృద్ధి ఏలూరి చేసి చూపించారు.యువకుడు, ఉన్నత విద్యావంతుడు అయిన ఏలూరి మాటల్లో కాన్ఫిడెన్స్ చూసే చంద్రబాబు ఆయనకు పరుచూరు పగ్గాలు ఇచ్చారు. 2012 చివరి నుంచి ఆయన నియోజకవర్గంలో జర్నీ స్టార్ట్ చేశారు. నియోజకవర్గంలో 170 గ్రామాల్లో పాదయాత్ర చేసిన ఆయన నియోజకవర్గాన్ని అణువణువు జల్లెడ పట్టేశారు. 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో పరుచూరులో టీడీపీ సత్తా చాటాక బాబుకు ఏలూరిపై తిరుగులేని గురి కుదిరింది. ఇక 2014 ఎన్నికల్లో గెలిచాక నియోజకవర్గంలో సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ వచ్చారు.

నియోజకవర్గంలో రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ క్రమంలోనే కొణికి వాగుపై రు. 4 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. పరుచూరు – అడుసుమిల్లి మధ్య 4 బ్రిడ్జిల నిర్మాణంతో పాటు చిన్నగంజాం – పెద్ద గంజా మధ్యలో రు. 15 కోట్ల అంచనాలతో 200 మీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం అప్పట్లో జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది. 2014 ఎన్నికలకు ముందు ఇది పూర్తి చేయకపోతే మళ్లీ తాను మండలానికి వచ్చి ఓట్లు అడగనని శపథం చేశారు. తర్వాత పట్టుదలతో ఈ బ్రిడ్జిని పూర్తి చేశాక దానిపై నడుస్తూ తాను మాట ఇస్తే తప్పనని ప్రజల్లో పెద్ద భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ఆయన హయాంలో పదుల సంఖ్యలో బ్రిడ్జిలు పూర్తి చేశారు.ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకముందు పెద్దగంజాం నుంచి చిన్నగంజాం వెళ్లాలంటే 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు కేవలం ఐదు నిమిషాల జర్నీతో ఇక్కడ ప్రజల టైం కలిసి రావడంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా మెరుగు పడింది. నియోజకవర్గంలో ఇంకొల్లు, పరుచూరు, మార్టూరు బస్టాండ్ల అభివృద్ధికి నాటి ఆర్టీసీ ఎండీ మాలకొండయ్యను తీసుకువచ్చి కోట్లాది నిధులతో వాటిని అభివృద్ధి చేశారు. అలాగే సీసీ రోడ్లతో పాటు నియోజకవర్గంలో తాగునీరు లేక ఇబ్బంది పడుతోన్న పలు గ్రామాలకు శాశ్వతంగా మంచినీళ్లు అందించే పథకాలు తీసుకువచ్చారు.

నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉన్న గ్రామాలకు కొమ్మమూరు కాలువ నీళ్లను తీసుకువచ్చి ఓవర్ హెడ్ ట్యాంకులతో మంచినీళ్లు అందించే పథకాలు పూర్తి చేశారు. ఏలూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గంలో 50 వేల మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారు. అందుకే నియోజకవర్గ జనాలు 2019లో అద్భుతమైన తీర్పు ఇచ్చి ఏలూరిని రెండోసారి గెలిపించారు.పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా.. ఏలూరిని ఎంత టార్గెట్ చేస్తున్నా కూడా రైతులకు పార్టీలతో సంబంధం లేకుండా మిరపనారు అందించారు. ఎన్నారైలతో మాట్లాడి వారి సాయంతో పరుచూరు రైతులకు స్ప్రేయర్లు అందించారు. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే ఏలూరి కమిట్‌మెంట్, సేవా ధృక్పథం నచ్చే ఆయనకు రెండోసారి పట్టం కట్టారు. ఈ జోరు చూస్తుంటే ఏదైనా అద్భుతం జరిగే వరకు పరుచూరు గడ్డ ఏలూరి అడ్డాగానే ఉండనుంది.

Discussion about this post