ఏపీ సీఎం జగన్ దావోస్ టూర్ పై అనేక రూపాల్లో విమర్శలు వస్తున్నాయి. దాదాపు వారం రోజులకు పైగా నే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించిన సీఎం జగన్.. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో ఏపీకి ఉన్న అవకాశాలను విశదపరిచారు. ఏపీకి తరలిరావాలంటూ. ఆయన కొన్ని కంపెనీలను కోరారు. ఈ క్రమంలో ఆయన ప్రయత్నం బాగానే ఉన్నప్పటికీ.. ఏపీకి ఏం సాధించారు? అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. ఎం దుకంటే.. దావోస్ పర్యటన నిమిత్తం జగన్ సహా అధికారులు రూ.5 కోట్ల రూపాయలపైనే ఖర్చు చేశారు.

దీనికన్నా ఎక్కువగానే సీఎం జగన్ ఖర్చు చేసి ఉంటారనే అంచనాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా.. దావోస్ పర్యటనలో జగన్ సాధించింది ఏంటి? ఏం తెచ్చారు? ఏపీని ఎలా అభివృద్ధి చేస్తారు? అనేది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. పొరుగు రాష్ట్రం తెలంగాణకు సంబంధించి మంత్రి కేటీఆర్ సుమారు 5 వేల కోట్ల మేరకు దావోస్ పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు ప్రబుత్వం వెల్లడిం చింది. ఏపీ విషయానికి వస్తే.. ఈ తరహా ప్రకటన ఇప్పటి వరకు చేయలేదు.దీంతో ఏపీ సాధించింది ఏంటి? అనేది కీలకంగా మారింది. నిజానికి గతంలో చంద్రబాబు హయాంలో వచ్చిన కియా మోటార్స్ వంటివి.. దావోస్‌లో కుదిరిన ఒప్పందాల కారణంగానే ఏపీకి వచ్చాయి. ఇప్పుడు కూడా సీఎం జగన్ తన బిజినెస్ వ్యూహంతో వ్యవహరించి…ఏపీకి ఏమైనా తీసుకువస్తారేమోనని.. అందరూ అనుకున్నారు. కానీ, ఆశించిన విధంగా ఆయన ఏమీ తీసుకురాలేక పోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏం చెబుతారు? అనేదానిపై అందరూ దృష్టి పెట్టారు.

వాస్తవానికి దావోస్ పర్యటన అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారింది. రెండేళ్ల కరోనా తీవ్రత తర్వాత.. ఏపీ ప్రభుత్వానికి తొలి సారి ఛాన్స్ వచ్చింది. అయితే.. ఇప్పుడు.. దీనిని సద్వినియోగం చేసుకుని ఉండ కపోతే.. వచ్చే ఏడాది ఒక్క సంవత్సరమే ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఒప్పందాలు చేసుకున్నా.. తదుపరి జగన్ అధికారంలోకివస్తే.. సరేసరి. కానీ, అలా కాకుండా పోతే.. తర్వాత వచ్చే ప్రబుత్వాలు.. వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం ఖాయం. సో.. ఏదేమైనా.. దావోస్ పర్యటనకు రూ.5 కోట్లు ఖర్చయినా.. ప్రయోజనం కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
Discussion about this post