ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో అధికార వైసీపీ వన్‌సైడ్ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. మరి ఈ విజయం కేవలం వైసీపీ అద్భుత పాలనని చూసి ప్రజలు ఇచ్చారా? అంటే…ఆ విషయం ప్రజలని అడిగితే బెటర్ అని చెప్పొచ్చు. వైసీపీ ఏ రకంగా గెలిచిందో అందరికీ తెలుసు. పైగా ఎన్నికలని ప్రధాన ప్రతిపక్ష టిడిపి బహిష్కరించింది. మరి ఇలాంటి పరిస్తితుల్లో తమ విజయం అద్భుతమని, ప్రజలందరూ తమతోనే ఉన్నారని వైసీపీ డప్పు కొట్టుకుంటుంది.

దీనికి తోడు వైసీపీకి మనస్సాక్షి లేకుండా భజన చేసే ఓ మీడియా సంస్థ కూడా మామూలు హడావిడి చేయడం లేదు. ఇది చరిత్రలో ఎవరికి దక్కని విజయమని ఒకటే భజన చేస్తుంది. జగన్ పాలన ఎలా ఉందో…ఆ పాలన వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో కూడా తెలుసు. అయినా సరే జగన్ పట్ల ప్రజాదరణ పెద్ద ఎత్తున పెరిగిందని చెప్పుకుంటుంది. పైగా 2019 ఎన్నికల్లో వైసీపీకి 49.95 శాతం ఓట్లు వచ్చాయని, అలాగే టిడిపికి 39.17 శాతం వచ్చాయని, జనసేన ఇతర పార్టీలకు 10.88 శాతం ఓట్లు వచ్చాయని చెబుతూనే…ఇప్పుడు స్థానిక సమరంలో వైసీపీకి 67.61 శాతం, టిడిపికి 22.79 శాతం, జనసేన, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లకు 9.60 శాతం ఓట్లు వచ్చాయని చెప్పింది.

సరే ఈ శాతాలు నిజమే….మరి జగన్ పాలనకు మెచ్చే 67.61 శాతం ప్రజలు ఓట్లు వేశారా? అంటే వేయలేదనే సంగతి అందరికీ తెలుసు. పైగా టిడిపి ఎన్నికలని బహిష్కరించిన కూడా 22 శాతం వరకు ఓట్లు పడ్డాయి. పైగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే…స్థానిక ఎన్నికల్లో అసలు పడిన ఓట్లే 60 శాతం…అంటే 40 శాతం మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మరి ఆ 60 శాతంలోనే…67.61 శాతం వైసీపీకి ఓట్లు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటుంది. ఈ భజన వైసీపీ వాళ్ళు నమ్ముతారు గానీ, మిగిలిన జనం నమ్మడం కష్టం.

Discussion about this post