ఆరోగ్యానికి 66 సూత్రాలు అన్నట్లు….ఆదాయానికి కూడా 66 సూత్రాలు ఉన్నాయని మన సీఎం జగన్ ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక మార్గాల్లో ఆదాయం సృష్టిస్తున్నారు. అలా అని అభివృద్ధి చేసి ఆదాయం సృష్టించడం లేదు…కేవలం ధరలు పెంచడం…పన్నులు వేయడం ద్వారానే ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఎలాగోలా అప్పులు చేసి ప్రజలకు పథకాల రూపంలో డబ్బులు పంచి పెడుతున్నారు. మళ్ళీ అంతకామించి పన్నుల భారం మోపి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

అయితే ఇప్పటికే మద్యం, ఇసుక, పెట్రోల్, డీజిల్, ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్, ఆర్టీసీ ఛార్జీలు అంటూ అనేక రూపాల్లో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక ఇంకా ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి జగన్ ప్రభుత్వం సరికొత్త మార్గాలని అన్వేషిస్తుంది. అసలు ఏ ప్రభుత్వానికి రాని ఐడియాలు…జగన్ ప్రభుత్వానికే వస్తున్నాయి. అసలు 1983 నుంచి 2018 వరకు ఆయా ప్రభుత్వాల హయాంలో…ప్రభుత్వ స్కీమ్‌ల ద్వారా కట్టుకున్న ఇళ్లకు…ఇప్పుడు రూ.10 వేలు కడితే…సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. గ్రామాల్లో 10 వేలు…పట్టణాల్లో 20 వేలు కట్టాలి. అసలు ఎప్పుడో కట్టుకున్న తమ ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టడం ఏంటని ప్రజలు గోల పెడుతున్నారు. దీనిపై రచ్చ జరుగుతుండగానే…జగన్ ప్రభుత్వం మరో సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది. తాజాగా ప్రభుత్వం….ప్రైవేట్ లేఔట్ల నిర్మాణాల్లో 5 శాతం భూమిని ఇవ్వాలంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కొత్తగా నిర్మించే లేఔట్‌లో భూమిని ఇవ్వలేకుంటే, దానికి మూడు కిలోమీటర్ల పరిధిలో భూమిని కొని ఇవ్వాలని, లేని పక్షంలో ఆ భూమి విలువ మేర.. డబ్బులు కూడా చెల్లించే ఆప్షన్ కూడా ప్రభుత్వం ఇచ్చింది.

ఇలా వచ్చే భూమిని గానీ, డబ్బులు గానీ జగనన్న కాలనీలకు వాడతామని ప్రభుత్వం చెబుతోంది. అసలు కాలనీలకు వాడటం పక్కనబెడితే…ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది. మరి ఇంకా రానున్న రోజుల్లో జగన్ ప్రభుత్వం ఎలాంటి ఐడియాలతో ముందుకోస్తుందో చూడాలి.
Discussion about this post