May 31, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీకి భారీ దెబ్బ..ఎంపీ సీట్లు కూడా కోల్పోతుంది!

ఏపీలో అధికార వైసీపీ పరిస్తితి రివర్స్ లో వెళుతుంది. ఇప్పటివరకు అధికార బలంతో అన్నీ ఎన్నికల్లో గెలిచినా సరే..ఇక నుంచి వైసీపీకి రివర్స్ అవ్వడం మొదలైంది..మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఓడిపోవడం..ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా ఒక స్థానం ఓడిపోవడంతో వైసీపీ సీన్ రివర్స్ అయింది. ఇక ప్రజా వ్యతిరేకత వైసీపీపై స్పష్టంగా కనిపిస్తుంది. అటు నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి షాక్ ఇచ్చారు.

ఇటీవల సర్వేల్లో వైసీపీకి భారీ షాకులు తప్పవని తేలింది. ఇదే సమయంలో అసెంబ్లీ సీట్లే కాదు..ఎంపీ సీట్లని సైతం వైసీపీ భారీగా కోల్పోయే అవకాశాలు ఉన్నాయని తేలింది. గత ఎన్నికల్లో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రజలని నమ్మించి జగన్ 22 మంది ఎంపీలని గెలుచుకున్నారు. టి‌డి‌పి నుంచి ముగ్గురు గెలిచారు. ఇక టి‌డి‌పి నుంచి గెలిచిన ముగ్గురు రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో పోరాడుతున్నారు గాని..వైసీపీ 22 మంది ఎంపీలు నోరు మెదపడం లేదు. ఇటు జగన్ సైతం ఢిల్లీకి వెళ్ళి చేసేదేమీ లేదు.

దీంతో వైసీపీ ఎంపీలని అనవసరం గా గెలిపించామనే భావన ప్రజల్లో వచ్చేసింది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఎంపీలకు జనం గట్టిగా షాక్ ఇచ్చేలా ఉన్నారు. భారీ స్థాయిలో వైసీపీ ఓడిపోయేలా ఉంది. ఒకవేళ టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే మాత్రం ఊహించని స్థాయిలో వైసీపీ ఎంపీలు ఓడిపోయేలా ఉన్నారు.

పొత్తు ఉంటే…శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, నరసారావుపేట, ఒంగోలు, చిత్తూరు, అనంతపురం, హిందూపురం ఎంపీ సీట్లని వన్ సైడ్ గా గెలుచుకునేలా ఉన్నాయి. వైసీపీకి ఎంపీ సీట్లలో కూడా భారీ షాక్ తగిలేలా ఉంది.