ఏపీ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి…అధికార వైసీపీపై ఊహించని విధంగా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా టీడీపీ పుంజుకుంటుంది..ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయినట్లు కనిపిస్తోంది…ఇంకా చెప్పాలంటే గత 15, 20 ఏళ్లుగా గెలవని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పుంజుకుంటుంది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో గెలిచి మళ్ళీ ఇప్పటివరకు గెలవని నియోజకవర్గాల్లో టీడీపీ బలపడుతుంది.

ఇదే క్రమంలో కర్నూలు జిల్లాలో వైసీపీ కంచుకోటల్లో ఒకటిగా ఉన్న ఆదోనిలో కూడా టీడీపీ బలపడుతుంది. అసలు ఆదోనిలో టీడీపీ నాలుగుసార్లు మాత్రమే గెలిచింది…1983, 1994, 1999, 2009 ఎన్నికల్లో మాత్రమే పార్టీ గెలిచింది. ఇందులో మూడుసార్లు మీనాక్షి నాయుడు గెలిచారు. అయితే 2004, 2014, 2019 ఎన్నికల్లో మీనాక్షి నాయుడు టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత రెండు ఎన్నికల్లో వరుసగా వై సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి గెలుస్తున్నారు.ఈయన 2004లో కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచారు. అయితే గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి సత్తా చాటారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతోనే సాయిప్రసాద్ గెలిచారు. పైగా వైసీపీ అధికారంలోకి వచ్చింది…మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి, అధికారంలో ఉండి కూడా సాయిప్రసాద్…ఆదోనిలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోవడం గమనార్హం. నియోజకవర్గంపై సాయిప్రసాద్ రెడ్డికి పూర్తి పట్టు ఉంది…ప్రజల అండ కూడా ఉంది. అయినా సరే తనకు అండగా ఉన్న ప్రజలకు అండగా ఉండటంలో సాయిప్రసాద్ విఫలమవుతున్నట్లు కనిపిస్తున్నారు.

ఆ విషయం గడప గడపకు వెళుతున్న సాయిప్రసాద్ రెడ్డికి బాగా అర్ధమవుతుంది. గడప గడపకు వెళుతున్న ఎమ్మెల్యేలని ప్రజలు ఎక్కడకక్కడే నిలదీస్తున్నారు. అయితే ఎమ్మెల్యే ఓపికగా సమాధానాలు చెప్పకుండా ప్రజలనే రివర్స్ లో తిట్టే పరిస్తితి ఉంది. ఇక ఎమ్మెల్యే వైఖరి ఆదోని ప్రజలకు పెద్దగా నచ్చడం లేదనే చెప్పొచ్చు..ఇక వచ్చే ఎన్నికల్లో మరొకసారి సాయిప్రసాద్ వైపు ఆదోని ప్రజలు నిలబడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అదే సమయంలో వరుసగా ఓడిపోతున్న మీనాక్షి నాయుడుపై ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో ఆదోనిలో వైసీపీ కోటని టీడీపీ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది.
Discussion about this post